యెషయా 10
10
1విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలె
ననియు
2తలిదండ్రులులేనివారిని కొల్లపెట్టుకొనవలెననియు
కోరి
న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించు
టకును
నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును
అన్యాయపు విధులను విధించువారికిని
బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని
శ్రమ.
3దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున
మీరేమి చేయుదురు?
సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు?
మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?
4వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు
హతులైనవారి క్రింద కూలుచున్నారు
ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు
ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
5అష్షూరీయులకు శ్రమవారు నాకోపమునకు సాధనమైన దండము
నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.
6భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను
దోపుడుసొమ్ము దోచుకొనుటకును
కొల్లపట్టుటకును వీధులను త్రొక్కించుటకును
నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి
కాజ్ఞాపించెదను.
7అయితే అతడు ఆలాగనుకొనడు
అది అతని ఆలోచనకాదు;
నాశనము చేయవలెననియు
చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని
ఆలోచన.
8అతడిట్లనుకొనుచున్నాడు
–నా యధిపతులందరు మహారాజులు కారా?
9కల్నో కర్కెమీషువలె నుండలేదా?
హమాతు అర్పాదువలె నుండలేదా?
షోమ్రోను దమస్కువలె నుండలేదా?
10విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి
చిక్కినవి గదా?
వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల
విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?
11షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసి
నట్లు
యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక
పోదునా అనెను.
12కావున సీయోను కొండమీదను యెరూషలేము
మీదను
ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత
నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని
ఫలమునుబట్టియు
అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని
శిక్షింతును.
13అతడు–నేను వివేకిని
నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగుచేసితిని
నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను
దోచుకొంటిని
మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని
14పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు
జనముల ఆస్తి నా చేత చిక్కెను.
ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు
రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను
కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు
నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొను
చున్నానని అనుకొనును.
15గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా?
రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా?
కోల తన్నెత్తువానిని ఆడించినట్లును
దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?
16ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా
బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపునువారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.
17ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును
అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును;
అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ
పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని
మ్రింగివేయును.
18ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా
శరీర ప్రాణములతోకూడ అతని అడవికిని
అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను
అది నాశనము చేయును.
19అతని అడవిచెట్ల శేషము కొంచెమగును
బాలుడు వాటిని లెక్కపెట్టవచ్చును.
20ఆ దినమున ఇశ్రాయేలు శేషమును
యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును
తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక
సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన
యెహోవాను
నిజముగా ఆశ్రయించెదరు.
21శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు
దేవునివైపు తిరుగును.
22నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండి
నను
దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణ
యింపబడెను.
23నీతి ప్రవాహమువలె వచ్చును
ఏలయనగా తాను నిర్ణయించిన సమూలనాశనము
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా
సర్వలోకమున కలుగజేయును.
24ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా
ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–సీయోనులో నివసించుచున్న నా జనులారా,
ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి
నీమీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము.
25ఇకను కొద్ది కాలమైన తరువాత నాకోపము చల్లారునువారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.
26ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు
సైన్యములకధిపతియగు యెహోవా
తన కొరడాలను వానిమీద ఆడించును.
ఆయన దండము సముద్రమువరకు వచ్చును
ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును.
27ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి
వేయబడును.
నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును
నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.
28అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు
మిగ్రోను మార్గముగా పోవుచున్నారు
మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు
29వారు కొండసందు దాటి వచ్చుచున్నారు
రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు
సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.
30గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి
లాయిషా, ఆలకింపుము
అయ్యయ్యో, అనాతోతు
31మద్మేనా జనులు పారిపోవుదురు
గిబానివాసులు పారిపోదురు
32ఈ దినమే దండు నోబులో దిగును
ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూష
లేము కొండమీద వారు తమ చెయ్యి ఆడించుదురు
33చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు
యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా
మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి
పడిపోవును.
34ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును
లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 10: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.