యెషయా 30

30
1యెహోవా వాక్కు ఇదే
–లోబడని పిల్లలకు శ్రమ
పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు
నన్ను అడుగక ఆలోచనచేయుదురు
నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు
2వారు నా నోటి మాట విచారణచేయక
ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు
ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా
ణము చేయుదురు.
3ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును
ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.
4యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడువారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు
5వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ
మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక
సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై
సిగ్గుపడుదురు.
6దక్షిణ దేశములోనున్న క్రూరమృగములనుగూర్చిన
దేవోక్తి
సింహీ సింహములును పాములును
తాపకరమైన మిడునాగులు నున్న
మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు
గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని
ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు
కొని
తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని
తీసికొని పోవుదురు.
7ఐగుప్తువలని సహాయము పనికిమాలినది, నిష్పయోజన
మైనది
అందుచేతను–ఏమియు చేయక ఊరకుండు గప్పాల
మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.
8రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము
సాక్ష్యార్థముగా నుండునట్లు
నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ
ములో లిఖింపుము
9వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు
యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు
10దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును
–యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి
మృదువైన మాటలనే మాతో పలుకుడి
మాయాదర్శనములను కనుడి
11అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట
ఎత్తకుడి
అని భవిష్యద్ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.
12అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు
ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక 13ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.
14కుమ్మరికుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు
విడిచిపెట్టక దాని పగులగొట్టును
పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని
గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క
పెంకైనను దొరకదు.
15ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింప
బడెదరు
మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము
కలుగును.
16అయినను మీరు సమ్మతింపక–అట్లు కాదు, మేము
గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి
కాగా మీరు పారిపోవలసి వచ్చెను.
మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే
కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా
నుందురు.
17మీరు పర్వతముమీదనుండు కొయ్యవలెను
కొండమీదనుండు జెండావలెను అగువరకు
ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు
అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు.
18కావున మీయందు దయచూపవలెనని యెహోవా
ఆలస్యమువేయుచున్నాడు
మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి
యున్నాడు
యెహోవా న్యాయముతీర్చు దేవుడు
ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.
19సీయోనులో యెరూషలేములోనే యొక జనము
కాపురముండును.
జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు
ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు
ణించును
ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.
20ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును
ఇకమీదట నీ బోధకులు దాగియుండరు
నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు
21మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను
–ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి
యొక శబ్దము నీ చెవులకు వినబడును.
22చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును
పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు
అపవిత్రపరతురు
హేయములని వాటిని పారవేయుదురు.
–లేచిపొమ్మని దానితో చెప్పుదురు.
23నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన
వాన ఆయన కురిపించును
భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును
అది విస్తార సార రసములు కలదై యుండును
ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో
మేయును.
24భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట
తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో
కలిసిన మేత తినును.
25గోపురములు పడు మహా హత్యదినమున
ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి
కొండమీదను
వాగులును నదులును పారును.
26యెహోవా తన జనుల గాయముకట్టి వారి దెబ్బను
బాగుచేయు దినమున
చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును
సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక
దినమున ప్రకాశించినట్లుండును.
27ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు
పొగతోకూడినదై
యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది
ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి
ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.
28ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన
నదివలె ఉన్నది
వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము
లను గాలించును
త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.
29రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు
సంగీతము పాడుదురు.
ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క
పర్వతమునకు
పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి
కలుగునట్టి హృదయసంతోషము కలుగును.
30యెహోవా తన ప్రభావముగల స్వరమును విని
పించును
ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను
పెళపెళయను గాలివాన వడగండ్లతోను
తన బాహువు వాలుట జనులకు చూపించును.
31యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది
ఆయన స్వరము విని భీతినొందును.
32యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక
దండమువలని ప్రతి దెబ్బ
తంబుర సితారాల నాదముతో పడును
ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు
యుద్ధము చేయును.
33పూర్వమునుండి తోఫెతు#30:33 అనగా హేయమైన శ్మశానము. సిద్ధపరచబడియున్నది
అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది
లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి
యున్నాడు
అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది
గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని
రగులబెట్టును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 30: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి