యెషయా 41
41
1ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి .
జనములారా, నూతనబలము పొందుడి.వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను
వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము
రండి.
2తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు
నుండి రేపి పిలిచినవాడెవడు?
ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు
రాజులను లోబరచుచున్నాడు
ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు
ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు
చున్నాడు.
3అతడు వారిని తరుముచున్నాడు
తాను ఇంతకుముందు వెళ్లనిత్రోవనే సురక్షితముగ
దాటిపోవుచున్నాడు.
4ఎవడు దీని నాలోచించి జరిగించెను?
ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన
యెహోవానగు నేనే
నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.
5ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు
వణకుచున్నవి
జనులు వచ్చి చేరుచున్నారు
6వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు
ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు
కొందురు.
7అతుకుటనుగూర్చి
–అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని
ప్రోత్సాహపరచును
సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు
వానిని ప్రోత్సాహపరచును
విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని
బిగించును.
8నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన
యాకోబూ,
నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
9-10భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల
నుండి పిలుచుకొనినవాడా,
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక
యేర్పరచుకొంటిననియు
నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను
భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను
దిగులుపడకుము నేను నిన్ను బలపరతును
నీకు సహాయము చేయువాడను నేనే
నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
11నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె
దరు
నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
12నీతో కలహించువారిని నీవు వెదకుదువుగాని వారిని
కనుగొనలేకపోవుదువు
నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు
అభావులగుదురు.
13నీ దేవుడనైన యెహోవానగు నేను–భయపడకుము
నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు
నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
14పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రా
యేలూ, భయపడకుడి
నేను నీకు సహాయము చేయుచున్నాను
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు
నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
15కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి
మ్రానుగా నిన్ను నియమించియున్నాను
నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయు
దువు
కొండలను పొట్టువలె చేయుదువు
16నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును
సుడిగాలి వాటిని చెదరగొట్టును.
నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు
ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.
17దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకకవారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది,
యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను
ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.
18జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము
చేసెననియు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు
తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు
నట్లు
19చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను
లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను
అరణ్యమును నీటిమడుగుగాను
ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.
20నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ
చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం
చెదను
అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి
వృక్షములను నాటెదను.
21–వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు
మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు
చున్నాడు.
22జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ
జెప్పుడి
పూర్వమైనవాటిని విశదపరచుడి
మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు
వాటిని మాకు తెలియజెప్పుడి
లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.
23ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి
అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము
మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు
మేలైనను కీడైనను చేయుడి.
24మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము
మిమ్మును కోరుకొనువారు హేయులు.
25ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను
నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ
దిక్కునుండి వచ్చుచున్నాడు
ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు
నట్లు
అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.
26మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు
తెలియజెప్పినవాడెవడు?
ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ
కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు?
దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా
డెవడును లేడు
మీ మాటలు వినువాడెవడును లేడు.
27ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో
చెప్పిన వాడను నేనే
యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని
నేనే పంపితిని.
28నేను చూడగా ఎవడును లేకపోయెను
నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల
ఆలోచనకర్త యెవడును లేకపోయెను.
29వారందరు మాయాస్వరూపులువారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు
శూన్యములు
అవి వట్టిగాలియై యున్నవి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 41: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.