యెషయా 48

48
1యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు .
కలిగినవారలారా,
యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై
యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు
ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు
నీతిసత్యములను అనుసరింపనివారలారా,
ఈ మాట ఆలకించుడి.
2వారు–మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టు
కొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు
సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు
పేరు.
3పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల
కాలముక్రిందట తెలియజేసితిని
ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను
వాటిని ప్రకటించితిని
నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ
వించెను.
4నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ
నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి
5–నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు
నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోతవిగ్రహము
దీని నియమించెననియు
నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమా
చారము నీకు తెలియజేసితిని
అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని
6నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలో
చించుము
అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా?
తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట
నీకు తెలియజేయుచున్నాను
7అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి
ఇప్పుడు కలుగునవియే.
అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు,
ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండ
లేదు.
8అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు
పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు
నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది
మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని
పించుకొంటివని నాకు తెలియును.
9నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ
మునుబట్టి నాకోపము మానుకొనుచున్నాను
నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు
కొనుచున్నాను.
10నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు
ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని
11నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను
నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను
మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.
12యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి
యొగ్గి వినుము.
నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను
13నా హస్తము భూమి పునాదివేసెను
నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను
నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు
నిలుచును.
14మీరందరు కూడివచ్చి ఆలకించుడి
వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును?
యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకా
రము బబులోనునకు చేయును
అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.
15నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని
నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును.
నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి
16ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను
కాను
అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న
వాడను
ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు
నన్ను పంపెను
17నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన
యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును
నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
18నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరు
చున్నాను
ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను
నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.
19నీ సంతానము ఇసుకవలె విస్తారమగును
నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును
వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు
మరువబడదు
20బబులోనునుండి బయలువెళ్లుడి
కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి
యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె
నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి
భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రక
టించుడి.
21ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు
దప్పిగొనలేదు
రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక
జేసెను
ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా
బయలుదేరెను.
22దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు
చున్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 48: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి