యెషయా 62

62
1సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు
దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు
సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను
యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.
2జనములు నీ నీతిని కనుగొనును
రాజులందరు నీ మహిమను చూచెదరు
యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట
బడును.
3నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను
నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను
ఉందువు.
4విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు
పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు
హెప్సీబా#62:4 ఇష్టురాలు. అని నీకును బ్యూలా#62:4 పతివ్రతయని. అని నీ భూమికిని
పేళ్లు పెట్టబడును.
యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు
నీ దేశము వివాహితమగును.
5యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు
నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు
పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించు
నట్లు
నీ దేవుడు నిన్నుగూర్చి సంతోషించును.
6యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను
రేయైన పగలైనవారు మౌనముగా ఉండరు.
7యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి
ఆయన యెరూషలేమును స్థాపించువరకు
లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు
ఆయనను విశ్రమింపనియ్యకుడి.
తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ
నియు
8యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను
–నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు
ఆహారముగా నేనియ్యను
నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు
త్రాగరు.
9ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు
స్తుతి చెల్లింతురు
పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో
దాని త్రాగుదురు.
10గుమ్మములద్వారా రండి రండి
జనమునకు త్రోవ సిద్ధపరచుడి
రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి
రాళ్లను ఏరి పారవేయుడి
జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.
11ఆలకించుడి, భూదిగంతములవరకు
యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు
ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది
ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే
యున్నది
ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా
డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.
12పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార
నియు వారికి పేరు పెట్టబడును.
యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని
పట్టణమనియు
నీకు పేరు కలుగును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 62: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి