యోబు 13
13
1ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను.
నా చెవి దాని విని గ్రహించియున్నది
2మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది
నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.
3నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరు
చున్నాను
దేవునితోనే వాదింప గోరుచున్నాను
4మీరైతే అబద్ధములు కల్పించువారు.
మీరందరు పనికిమాలిన వైద్యులు.
5మీరు కేవలము మౌనముగా నుండుట మేలు
అది మీకు జ్ఞానమని యెంచబడును.
6దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము
నాలకించుడి.
7దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?
ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?
8ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?
దేవుని పక్షమున మీరు వాదింతురా?
9ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?
లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు
ఆయనను మోసముచేయుదురా?
10మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడల
నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
11ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా?
ఆయన భయము మీ మీదికి రాదా?
12మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.
మీ వాదములు మంటివాదములు
13నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి
నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.
14నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?
చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను
15ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు
కనిపెట్టుచున్నాను.
ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు
పరతును.
16ఇదియు నాకు రక్షణార్థమైనదగును
భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.
17నా వాఙ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి
నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొర
నీయుడి.
18ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొని
యున్నాను
నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.
19నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?
ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని
ప్రాణము విడిచెదను.
20ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము
అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.
21నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము
నీ భయము నన్ను బెదరింపనీయకుము
22అప్పుడు నీవు పిలిచినయెడల నేను నీ కుత్తర మిచ్చెదను
నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము
23నా దోషములెన్ని? నా పాపములెన్ని?
నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
24నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?
నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?
25ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు
వేధించెదవా?
ఎండిపోయిన చెత్తను తరుముదువా?
26నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు
నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా
నీవు విధించియున్నావు
27బొండలలో నా కాళ్లు బిగించియున్నావు
నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు
నా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు
28మురిగి క్షీణించుచున్న వానిచుట్టు
చిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టు
గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 13: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: