విలాపవాక్యములు 4

4
1వారిని నశింపజేయుదువు.
బంగారము ఎట్లు మందగిలినది?
మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది?
ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయ
బడియున్నవి.
2మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియ
కుమారులు
ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు?
3నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును
నా జనుల కుమారి యెడారిలోని ఉష్టపక్షులవలె
క్రూరురాలాయెను.
4దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటు
కొనును
పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.
5సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో
పడియున్నారు
రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట
కుప్పలను కౌగిలించుకొనెదరు.
6నా జనుల కుమారి చేసిన దోషము
సొదొమ పాపముకంటె అధికము
ఎవరును దానిమీద చెయ్యివేయకుండనే నిమిషములో
ఆ పట్టణము పాడుచేయబడెను.
7దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారువారు పాలకంటె తెల్లనివారు
వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివివారి దేహకాంతి నీలమువంటిది.
8అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెనువారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట
జాలరు.
వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది
అది యెండి కఱ్ఱవంటిదాయెను.
9క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి
పోయెదరు
ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.
10వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను
వండుకొనెను
నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలువారికి ఆహారమైరి.
11యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి
తన కోపాగ్నిని కుమ్మరించెను
సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను
అది దాని పునాదులను కాల్చివేసెను.
12బాధించువాడుగాని విరోధిగాని
యెరూషలేము గవునులలోనికి వచ్చునని
భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరి
కైనను తోచియుండలేదు.
13దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల
పాపములనుబట్టియు
దాని యాజకుల దోషమునుబట్టియు
14జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరువారు రక్తము అంటిన అపవిత్రులు
ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు.
15–పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని
జనులు వారితో ననిరి.వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైనవారు
–ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు
కొనిరి
16యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను
ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు
యాజకులయెడల జనులు గౌరవము చూపకపోయిరి
పెద్దలమీద దయ చూపకపోయిరి.
17వ్యర్థసహాయముకొరకు మేముకనిపెట్టుచుండగా
మా కన్నులు క్షీణించుచున్నవి
మేముకనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు
చూచుచుంటిమి.
18రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు
మా జాడలనుబట్టి వెంటాడుదురు
మా అంత్యదశ సమీపమాయెను
మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చే
యున్నది.
19మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల
కన్న వడిగలవారు
పర్వతములమీద వారు మమ్మును తరుముదురు
అరణ్యమందు మాకొరకు పొంచియుందురు.
20మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు
యెహోవాచేత అభిషేకము నొందినవాడువారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.
21–అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని
మేమనుకొన్నవాడు పట్టబడెను.
ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ,
సంతోషించుము ఉత్సహించుము
ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును
నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా
చేసికొందువు
22సీయోను కుమారీ, నీ దోషశిక్ష సమాప్తమాయెను
ఇకమీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి
కొనిపోడు
ఎదోము కుమారీ, నీ దోషమునకు ఆయన శిక్ష విధిం
చును
నీ పాపములను ఆయన వెల్లడిపరచును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

విలాపవాక్యములు 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి