కీర్తనలు 106
106
1యెహోవాను స్తుతించుడి
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుడి
ఆయన కృప నిత్యముండును.
2యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప
గలడు?
ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
3న్యాయము ననుసరించువారు
ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
4యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను
చూచుచు
నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో
షించుచు
5నీ స్వాస్థ్యమైనవారితోకూడి కొనియాడునట్లు
నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక
మునకు తెచ్చుకొనుము
నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.
6మా పితరులవలెనే మేము పాపము చేసితిమి
దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి
7ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను
గ్రహింపక యుండిరి
నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక
యుండిరి
సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు
బాటు చేసిరి.
8అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై
ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.
9ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను
మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము
లలో నడిపించెను.
10వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను
శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.
11నీళ్లు వారి శత్రువులను ముంచివేసెనువారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
12అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి
ఆయన కీర్తి గానము చేసిరి.
13అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి
ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
14అరణ్యములో వారు బహుగా ఆశించిరి
ఎడారిలో దేవుని శోధించిరి
15వారు కోరినది ఆయన వారికిచ్చెను
అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.
16వారు తమ దండు పాళెములో మోషేయందును
యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును
అసూయపడిరి.
17భూమి నెరవిడిచి దాతానును మ్రింగెను
అది అబీరాము గుంపును కప్పివేసెను.
18వారి సంఘములో అగ్ని రగిలెను
దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
19హోరేబులో వారు దూడను చేయించుకొనిరి.
పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి
20తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు
రూపమునకు మార్చిరి.
21ఐగుప్తులో గొప్ప కార్యములను
హాముదేశములో ఆశ్చర్యకార్యములను
22ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను
చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
23అప్పుడు ఆయన–నేను వారిని నశింపజేసెదననెను.
అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన
కోపము చల్లార్చుటకై
ఆయన ఏర్పరచుకొనిన మోషే
ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను
24వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి
ఆయన మాట నమ్మకపోయిరి
25యెహోవా మాట ఆలకింపకవారు తమ గుడారములో సణుగుకొనిరి.
26అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును
27అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును
దేశములో వారిని చెదరగొట్టుటకును
ఆయన వారిమీద చెయ్యి యెత్తెను.
28మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చినవారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి.
29వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగావారిలో తెగులు రేగెను.
30ఫీనెహాసు లేచి పరిహారముచేయగా#106:30 శిక్ష జరిగింపగా.
ఆ తెగులు ఆగిపోయెను.
31నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను.
32మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము
పుట్టించిరి
కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
33ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా
అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
34యెహోవావారికి ఆజ్ఞాపించినట్లువారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.
35అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు
నేర్చుకొనిరి.
36వారి విగ్రహములకు పూజచేసిరి
అవి వారికి ఉరి ఆయెను.
37మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను
దయ్యములకు బలిగా అర్పించిరి.
38నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ
కుమార్తెల రక్తము ఒలికించిరి
కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి
ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను.
39తమ క్రియలవలనవారు అపవిత్రులైరి
తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.
40కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద
రగులుకొనెను
ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.
41ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెనువారి పగవారు వారిని ఏలుచుండిరి.
42వారి శత్రువులు వారిని బాధపెట్టిరివారు శత్రువులచేతి క్రింద అణపబడిరి.
43అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను
అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు
బాటు చేయుచువచ్చిరి.
తమ దోషముచేత హీనదశనొందిరి.
44అయినను వారిరోదనము తనకు వినబడగావారికి కలిగినశ్రమను ఆయన చూచెను.
45వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను
జ్ఞాపకము చేసికొనెను
తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
46వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను.
47యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము
మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించునట్లును
నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును
అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.
48ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా
యుగములన్నిటను స్తుతినొందును గాక
ప్రజలందరు–ఆమేన్ అందురుగాక.
యెహోవాను స్తుతించుడి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 106: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: