కీర్తనలు 107
107
పంచమ స్కంధము.
1యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించుడి
ఆయన కృప నిత్యముండును.
2యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు
గాక
విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును
3తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి
దక్షిణము నుండియు
నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును
ఆమాట పలుకుదురుగాక.
4వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి.
నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను.
5ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.
6వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి
ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
7వారొక నివాస పురము చేరునట్లు
చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.
8ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు
ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు
గాక
9ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి
యున్నాడు.
ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి
యున్నాడు.
10దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని
తీర్మానమును తృణీకరించినందున
11బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై
చీకటిలోను మరణాంధకారములోను
నివాసముచేయువారి హృదయమును
12ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను.వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.
13కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి
ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
14వారి కట్లను తెంపివేసి
చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు
వారిని రప్పించెను.
15ఆయన కృపనుబట్టియు
నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు
గాక.
16ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి
యున్నాడు
ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.
17బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము
చేతను బాధతెచ్చుకొందురు.
18భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్యమగునువారు మరణద్వారములను సమీపించుదురు.
19కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి
ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
20ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను
ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.
21ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు
ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు
గాక.
22వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక
ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు
దురుగాక.
23ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు
మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయువారు
24యెహోవా కార్యములను
సముద్రములో ఆయనచేయు అద్భుతములను చూచిరి.
25ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను
అది దాని తరంగములను పైకెత్తెను
26వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు
దిగుచు నుండిరి
శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.
27మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు
ఇటు అటు తూలుచుండిరివారు ఎటుతోచక యుండిరి.
28శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి
ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
29ఆయన తుపానును ఆపివేయగా
దాని తరంగములు అణగిపోయెను.
30అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరివారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
31ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు
ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు
గాక.
32జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక
పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
33దేశనివాసుల చెడుతనమునుబట్టి
34ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన
నేలగాను
సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.
35అరణ్యమును నీటిమడుగుగాను
ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన
మార్చి
36వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును
పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి
37వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును
ఆయన ఆకలిగొనినవారిని అచ్చట కాపురముంచెను
38మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక
ముగా సంతానాభివృద్ధి నొందిరి
ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు
39వారు బాధవలనను ఇబ్బందివలనను
దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు
40రాజులను తృణీకరించుచు
త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు
వాడు.
41అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను
వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.
42యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు
మోసగాండ్రందరును మౌనముగా నుందురు.
43బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును
యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 107: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: