కీర్తనలు 111

111
1యెహోవాను స్తుతించుడి.
యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ
హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించెదను.
2యెహోవా క్రియలు గొప్పవి
వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించుదురు.
3ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది
ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.
4ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను
నియమించియున్నాడు.
యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు
5తనయందు భయభక్తులుగలవారికి ఆయన
ఆహారమిచ్చియున్నాడు
ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.
6ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు
తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి
యున్నాడు.
7ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి
ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.
8అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి
సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి
యున్నవి.
9ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు
తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు
వాడు.
ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.
10యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము
ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు.
ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 111: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి