కీర్తనలు 22
22
ప్రధానగాయకునికి. అయ్యలెత్ షహరు అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.
1నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?
నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా
నున్నావు?
2నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను
రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు
అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు.
3నీవు ఇశ్రాయేలుచేయు స్తోత్రములమీద ఆసీనుడవై
యున్నావు.
4మా పితరులు నీయందు నమ్మిక యుంచిరివారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని
రక్షించితివి.
5వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి
నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.
6నేను నరుడను కాను నేను పురుగును
నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీక
రింపబడిన వాడను.
7నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం
చుచు నన్ను అపహసించుచున్నారు.
8–యెహోవామీద నీ భారము మోపుము
ఆయన వానిని విడిపించునేమో
వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు
నేమో అందురు.
9గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా
నేను నా తల్లియొద్ద స్తన్యపానముచేయుచుండగా
నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి.
10గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే
నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు
నీవే.
11శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును
లేడు
నాకు దూరముగా నుండకుము.
12వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి
బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి.
13చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు
నోళ్లు తెరచుచున్నారు
14నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను
నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి
నా హృదయము నా అంతరంగమందుమైనమువలె
కరగియున్నది.
15నా బలము యెండిపోయి చిల్లపెంకు వలె ఆయెను
నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది
నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.
16కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి
దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.
17నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు
18నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు
నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.
19యెహోవా, దూరముగా నుండకుము
నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
20ఖడ్గమునుండి నా ప్రాణమును
కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.
21సింహపు నోటనుండి నన్ను రక్షింపుము
గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి
నాకు ఉత్తరమిచ్చియున్నావు
22నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను
సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.
23యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ
నను స్తుతించుడి
యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన
పరచుడి
ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు
భయపడుడి
24ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని
చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన
ముఖమును దాచలేదు.
వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.
25మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె
దను
ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా
మ్రొక్కుబడులు చెల్లించెదను.
26దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు
యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు
మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.
27భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని
యెహోవాతట్టు తిరిగెదరు
అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము
చేసెదరు
28రాజ్యము యెహోవాదే
అన్యజనులలో ఏలువాడు ఆయనే.
29భూమిమీద వర్ధిల్లుచున్నవారందరు అన్నపానములు
పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు
తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు
వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు
30ఒక సంతతివారు ఆయనను సేవించెదరు
రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు.
31వారు వచ్చి–ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు
తెలియజేతురు
ఆయన నీతిని వారికి ప్రచురపరతురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 22: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: