కీర్తనలు 30

30
గృహప్రతిష్టాపనగానము. దావీదు కీర్తన.
1యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో
షింపనియ్యక నీవు నన్నుద్ధరించియున్నావు
అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.
2యెహోవా నా దేవా,
నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
3యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును
లేవదీసితివి
నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి.
4యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి
ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమునుబట్టి
ఆయనను స్తుతించుడి.
5ఆయన కోపము నిమిషమాత్రముండును
ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును.
సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను
ఉదయమున సంతోషము కలుగును.
6–నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను
కొంటిని.
7యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర
పరచితివి
నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత
జెందితిని
8యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని
నా ప్రభువును బతిమాలుకొంటిని.
–నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన
ఏమి లాభము?
9మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి
అది వివరించునా?
10యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము
యెహోవా, నాకు సహాయుడవై యుండుము
11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు
నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి
యున్నావు.
12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము
నన్ను ధరింపజేసియున్నావు
యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించె
దను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 30: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి