కీర్తనలు 40
40
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు
కొంటిని
ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
2నాశనకరమైన గుంటలోనుండియు
జిగటగల దొంగఊబిలోనుండియు
ఆయన నన్ను పైకెత్తెను
నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర
పరచెను.
3తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు
నా నోట నుంచెను.
అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా
యందు నమ్మికయుంచెదరు.
4గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు
వారినైనను లక్ష్యపెట్టక
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
5యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన
ఆశ్చర్యక్రియలును
మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు.
వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు
మించియున్నవి
నీకు సాటియైనవాడొకడును లేడు.
6బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు.
నీవు నాకు చెవులు నిర్మించియున్నావు.
దహనబలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు
తెమ్మనలేదు.
7అప్పుడు–పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన
ప్రకారము నేను వచ్చియున్నాను.
8నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము
నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.
9నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి
సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని
యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
10నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర
కుండలేదు.
నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను
నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక
నేను వాటికి మరుగుచేయలేదు.
11యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము
చేయవు
నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక
12లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి
నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల
యెత్తి చూడలేకపోతిని
లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి
నా హృదయము అధైర్యపడి యున్నది.
13యెహోవా, దయచేసి నన్ను రక్షించుము
యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
14నా ప్రాణము తీయుటకై యత్నించువారు
సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక
నాకు కీడుచేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి
సిగ్గునొందుదురు గాక.
15నన్ను చూచి–ఆహా ఆహా అని పలుకువారు
తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.
16నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి
సంతోషించుదురు గాక
నీ రక్షణ ప్రేమించువారు–యెహోవా మహిమ
పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు
గాక.
17నేను శ్రమలపాలై దీనుడనైతిని
ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు.
నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే.
నా దేవా, ఆలస్యము చేయకుము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 40: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: