కీర్తనలు 41
41
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1బీదలను కటాక్షించువాడు ధన్యుడు
ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
2యెహోవా వానిని కాపాడి బ్రదికించును
భూమిమీద వాడు ధన్యుడగును
వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
3రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును
రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
4–యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి
యున్నాను
నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము
అని మనవి చేసియున్నాను.
5అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట
లాడుచున్నారు
–వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు
మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.
6ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ
మాడును
వాని హృదయము పాపమును పోగుచేసికొనుచున్నది.
వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.
7నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస
లాడుచున్నారు
నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో
చించుచున్నారు.
8–కుదురని రోగము వానికి సంభవించియున్నది
వాడు ఈ పడక విడిచితిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు.
9నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ
నము చేసినవాడు.
నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
10యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము
అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను.
11నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా
నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
12నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు
నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
13ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప
బడును గాక. ఆమేన్. ఆమేన్.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 41: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: