కీర్తనలు 48

48
కోరహు కుమారులది. గీతము.
1మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధపర్వతమందు
యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై
యున్నాడు.
2ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము
రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి
సంతోషకరముగా నున్నది
3దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష
మగుచున్నాడు.
4రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.
5వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి
భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.
6వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేద
నయు వారిని పట్టెను.
7తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు.
8సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు
మన దేవుని పట్టణమునందు
మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి
యున్నాము
దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. (సెలా.)
9దేవా, మేము నీ ఆలయమునందు
నీ కృపను ధ్యానించితిమి.
10దేవా, నీ నామము ఎంత గొప్పదో
నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది
నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది.
11నీ న్యాయవిధులనుబట్టి
సీయోను పర్వతము సంతోషించును గాక
యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.
12ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు
చెప్పునట్లు
సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి
13దాని బురుజులను లెక్కించుడి
దాని ప్రాకారములను నిదానించి చూడుడి
దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.
14ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు
మరణమువరకు ఆయన మనలను నడిపించును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 48: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి