కీర్తనలు 64

64
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము
శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.
2కీడుచేయువారి కుట్రనుండి
దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము
3ఒకడు కత్తికి పదును పెట్టునట్లువారు తమ నాలుక
లకు పదును పెట్టుదురు.
4యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో
చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని
కొట్టెదరు
5వారు దురాలోచన దృఢపరచుకొందురు
చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు
–మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు.
6వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నిం
తురు
వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు
ప్రతివాని హృదయాంతరంగము అగాధము.
7దేవుడు బాణముతో వారిని కొట్టునువారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.
8వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే
కారణము.
9వారిని చూచువారందరు తల ఊచుదురు
మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు
ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు
10నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు
ఆయన శరణుజొచ్చెదరు
యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 64: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి