కీర్తనలు 84
84
ప్రధానగాయకునికి గిత్తీత్ అను రాగముమీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన.
1సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు
ఎంత రమ్యములు
2యెహోవామందిరావరణములను చూడవలెనని
నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ
సిల్లుచున్నది
జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును
నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.
3సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా
దేవా,
నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను
పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.
4నీ మందిరమునందు నివసించువారు ధన్యులువారు నిత్యము నిన్ను స్తుతించుదురు. (సెలా.)
5నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు
యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.
6వారు బాకా లోయలోబడి వెళ్లుచు
దానిని జలమయముగా చేయుదురు
తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.
7వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము
చేయుదురు
వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని
కనబడును.
8యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన
ఆలకింపుము
యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా.)
9దేవా, మా కేడెమా, దృష్టించుము
నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.
10నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన
ములకంటె శ్రేష్ఠము.
భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె
నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.
11దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై
యున్నాడు
యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును
యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును
చేయక మానడు.
12సైన్యములకధిపతివగు యెహోవా,
నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 84: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.