1 సమూ 2:1-10

1 సమూ 2:1-10 IRVTEL

హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది. నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను. యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు. యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు. పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు. తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది. మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే. పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే. యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే. దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు. దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు. బలం వలన ఎవరూ విజయం సాధించలేరు. యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”

1 సమూ 2:1-10 కోసం వచనం చిత్రం

1 సమూ 2:1-10 - హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,
“నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.
యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది.
నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.
నా విరోధుల మీద నేను అతిశయపడతాను.
యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు.
నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు
మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.
యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది.
మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే.
కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు.
అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.
పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు.
తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు.
తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు.
ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు.
గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది.
ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.
మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే.
పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే.
యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు.
కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.
దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ,
మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ
వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే.
పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే.
భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి.
ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.
తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు.
దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు.
బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.
యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు.
పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు.
భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు.
తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”