ఎస్తేరు 10
10
మొర్దెకైకి గౌరవస్థానం
1అహష్వేరోషు మహారాజు ప్రజల దగ్గర్నుంచి పన్నులు వసూలు చేసేవాడు. సుదూర ప్రాంతాల్లో సముద్ర తీరాన వున్న నగర వాసులతో బాటు, సామ్రాజ్యంలోని ప్రజలందరూ పన్నులు చెల్లించవలసి వచ్చేది. 2అహష్వేరోషు మహారాజు చేసిన ఘనకార్యాలన్నీ మాదీయ, పారశీక రాజ్యాల చరిత్ర గ్రంథంలో లిఖింపబడ్డాయి. అలాగే మొర్దెకై చేసిన ఘనకార్యాలన్నీ కూడా ఆ చరిత్ర గ్రంథాల్లో చేర్చబడ్డాయి. మహారాజు మొర్దెకైకి ఘనమైన గౌరవస్థానం కల్పించాడు. 3సామ్రాజ్యంలో అహష్వేరోషు తర్వాత ప్రాముఖ్యంలో మొర్దెకైది ద్వితీయ స్థానం. యూదులందరిలో మొర్దెకైయే అతి ముఖ్యమైన వ్యక్తి. అతని తోటి యూదులు అతన్నెంతగానో గౌరవించేవారు. మొర్దెకై తన జాతీయ ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం విశేషంగా కృషి చేశాడు. మొర్దెకై యూదులందరికీ శాంతిని చేకూర్చాడు. అందుకే, సాటి యూదులందరికీ మొర్దెకై అంటే ఎంతో గౌరవం.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎస్తేరు 10: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International