హబక్కూకు 3

3
హబక్కూకు ప్రార్థన
1ప్రవక్తయైన హబక్కూకు చేసిన షిగియొనొతు ప్రార్థన.#3:1 అనగా షిగియొనొతు మీద హబక్కూకు చేసిన ప్రార్థన. షిగియొనొతు అంటే అసలైన అర్థం సరిగ్గా తెలియదు.
2యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను.
యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను.
అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను.
ఆ పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను.
కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము.
3దేవుడు తేమానులోనుండి వస్తున్నాడు.
పరిశుద్ధుడు పారాను పర్వతం#3:3 పర్వతం అకాబా సింధు శాఖకి పడమటనున్న ఒక ముఖ్యమైన పర్వతం కావచ్చు. మీది నుండి వస్తున్నాడు.
యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది!
ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది!
4అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుండి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి.
అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది.
5వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది.
ఆయన వెనుక వినాశకారి అనుసరించి వెళ్లింది.
6యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు.
ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు.
వారు భయంతో వణికి పోయారు.
అనాదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి.
కాని ఆ పర్వతాలు బద్దలై పోయాయి.
చాల పాత కొండలు పడిపోయాయి.
దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు!
7కుషాను (కూషీయుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను.
మిద్యాను దేశీయుల ఇండ్లు భయంతో కంపించాయి.
8యెహోవా, నీవు నదులపట్ల కోపంగా ఉన్నావా?
వాగులపట్ల నీవు కోపంగా ఉన్నావా? సముద్రంపట్ల నీవు కోపంగా ఉన్నావా?
నీవు నీ గుర్రాలను,
రథాలను విజయానికి నడిపించినప్పుడు నీవు కోపంగా ఉన్నావా?
9అప్పుడుకూడ నీ రంగుల కాంతిపుంజాన్ని (ఇంద్ర ధనుస్సును) నీవు చూపించావు. భూవాసులతో
నీవు చేసుకున్న ఒడంబడికకు అది నిదర్శనం.
ఎండు భూమి నదులను విభజించింది.
10పర్వతాలు నిన్ను చూచి వణికాయి.
నీరు నేల విడిచి పారుతున్నది. సముద్రపు నీటికి పట్టు తప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది.
11సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి.
నీ దేదీప్యమానమైన మెరుపు కాంతులు చూడగానే అవి ప్రకాశించటం మానివేశాయి.
ఆ మెరుపులు గాలిలో దూసుకుపోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.
12నీవు కోపంతో భూమిపై నడిచి
దేశాలను శిక్షించావు.
13నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు.
అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు.
ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు.
ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా,
లేక అతి గొప్పదా అనే విభేదం నీవు చూపలేదు.
14శత్రు సైనికులను ఆపటానికి నీవు
మోషే చేతి కర్రను ఉపయోగించావు.
ఆ సైనికులు మామీద యుద్ధానికి
పెనుతుఫానులా వచ్చారు.
రహస్యంగా ఒక పేదవాణ్ణి దోచుకున్నట్టు,
వారు మమ్మల్ని తేలికగా ఓడించవచ్చనుకున్నారు.
15కాని నీవు నీ గుర్రాలతో సముద్రంగుండా నడిచావు.
ఆ మహా జలరాశిని దూరంగా దొర్లిపోయేలా చేశావు.
16నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది.
పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి.
నా ఎముకలు బలహీనమయ్యాయి.
నా కాళ్లు వణికాయి.
కావున ఆ వినాశన దినం వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటాను.
మామీద దాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది.
ఎల్లప్పుడూ యెహోవాయందు ఆనందించండి
17అంజూరపు చెట్లు కాయలు కాయకుండా ఉండవచ్చు.
ద్రాక్షచెట్లపై కాయలు ఉండక పోవచ్చు.
చెట్లకు ఒలీవ పండ్లు కాయక పోవచ్చు.
పొలాల్లో ఆహార ధాన్యాలు పండక పోవచ్చు.
దొడ్లలో గొర్రెలు ఉండక పోవచ్చు.
కొట్టాలలో పాడి పశువులు లేకపోవచ్చు.
18అయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను.
నా రక్షకుడైన దేవునియందు నేను ఉల్లసిస్తాను.
19నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు.
లేడిలా పరుగెత్తగలిగేలా ఆయన నాకు సహాయపడతాడు.
పర్వతాలపై ఆయన నన్ను సురక్షితంగా నడిపిస్తాడు.
సంగీత దర్శకునికి. ఇది నా తంతి వాద్యాలతో పాడదగినది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హబక్కూకు 3: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి