1 దినవృత్తాంతములు 13
13
మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లుట
1దావీదు వేయిమందికి వందమందికి అధిపతులుగా ఉన్నవారందరిని సంప్రదించాడు. 2తర్వాత అతడు ఇశ్రాయేలు సమాజమంతటితో, “ఈ ఆలోచన మీకు మంచిదనిపిస్తే, ఇది మన దేవుడైన యెహోవా చిత్తమైతే, ఇశ్రాయేలు దేశమంతటా మిగిలి ఉన్న మన ప్రజలందరు, అలాగే వారి పట్టణాల్లో పచ్చిక మైదానాల్లో వారితో పాటు ఉంటున్న యాజకులు, లేవీయులు వచ్చి మనతో చేరాలని వారికి కబురు పంపండి. 3మన దేవుని నిబంధన మందసాన్ని తిరిగి తీసుకువద్దాము. సౌలు పాలనలో దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం” అన్నాడు. 4సమాజమంత దీనికి అంగీకరించింది, ఎందుకంటే వారందరికి అది మంచిదనిపించింది.
5కాబట్టి దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి తీసుకురావడానికి ఈజిప్టులో ఉన్న షీహోరు నది నుండి లెబో హమాతు వరకు ఉన్న ఇశ్రాయేలీయులందరిని సమకూర్చాడు. 6కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు అని పిలువబడే యెహోవా దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయులందరు యూదాలోని కిర్యత్-యారీము అని పిలువబడే బాలాకు వెళ్లారు.
7వారు దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి బయలుదేరారు, ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలారు. 8దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, సితారలు, వీణలు, తంబురలు, తాళాలు, బూరలు వాయిస్తూ తమ శక్తి అంతటితో దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
9వారు కీదోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు దేవుని మందసాన్ని పట్టుకోడానికి ఉజ్జా చేయి చాపాడు. 10ఉజ్జా మందసం మీద చేయి వేసినందుకు యెహోవా కోపం అతని మీద రగులుకుని ఆయన అతన్ని మొత్తగా అతడు అక్కడే దేవుని ఎదుట చనిపోయాడు.
11యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా#13:11 పెరెజ్ ఉజ్జా అంటే వినాశము ఉజ్జా మీద అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.
12ఆ రోజు దావీదు దేవునికి భయపడి, “దేవుని మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అడిగాడు. 13దేవుని మందసాన్ని తన దగ్గర పెట్టుకోడానికి దావీదు పట్టణానికి తీసుకెళ్లకుండా, అతడు దాన్ని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు. 14దేవుని మందసం ఓబేద్-ఎదోము ఇంట్లో అతని కుటుంబం దగ్గర మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటివారిని అతనికి కలిగిన సమస్తాన్ని దీవించారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 13: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.