హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది: “నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది; యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది. నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది, మీ విడుదలలో నాకు ఆనందము. “యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు; మీరు తప్ప మరి ఎవరు లేరు; మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు. “అంత గర్వంగా మాట్లాడకండి మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి, ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు. “శూరుల విల్లులు విరిగిపోయాయి, కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు. తృప్తిగా భోజనం చేసినవారు ఆహారం కోసం కూలికి వెళ్తారు, కాని ఆకలితో ఉన్నవారు ఇక ఆకలితో ఉండరు. గొడ్రాలిగా ఉన్న స్త్రీ ఏడుగురు పిల్లలను కన్నది, కాని అనేకమంది పిల్లలను కన్న స్త్రీ కృశించిపోతుంది. “మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే; పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే. పేదరికాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసేది యెహోవాయే; తగ్గించేది హెచ్చించేది ఆయనే. దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు. ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు, అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు. “బలం వలన ఎవరూ గెలవలేరు; యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు. పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు; భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు.
చదువండి 1 సమూయేలు 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 2:1-10
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు