2 కొరింథీ 9
9
1ప్రభువు ప్రజలకు చేస్తున్న పరిచర్య గురించి నేను మీకు వ్రాయాల్సిన అవసరం లేదు. 2సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా, అకయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది. 3అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివే అని రుజువుపరచకుండా, నేను చెప్పినట్లు చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను. 4ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో వచ్చినపుడు మీరు సిద్ధంగా లేరని చూస్తే, మీ గురించి మేమేమి చెప్పలేము, మీ పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగివున్నందుకు సిగ్గుపడాల్సి ఉంటుంది. 5అందుకే, మీరు వాగ్దానం చేసిన కానుకలు అయిష్టంగా ఇచ్చేవిగా కాకుండా దాతృత్వంతో ఇచ్చేవిగా సిద్ధపడి ఉండడం కొరకు ఏర్పాట్లన్ని పూర్తిచేయాడానికి మీ దగ్గరకు ముందుగానే వెళ్ళమని సహోదరులను అడగడం అవసరమని నేను అనుకున్నాను.
దాతృత్వం ప్రోత్సహింపబడుట
6ఇది జ్ఞాపకం ఉంచుకోండి: కొంచెం విత్తినవానికి కొంచెం పంటే పండుతుంది. దాతృత్వంతో విత్తినవానికి ధారాళంగా పంట పండుతుంది. 7సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు కనుక అయిష్టంగా లేదా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి. 8దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగల సమర్థుడు, అప్పుడు అన్ని విషయాల్లో, అన్నివేళల్లో, మీకు కావలసినవన్ని కలిగివుండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉంటారు. 9ఇలా వ్రాయబడి ఉంది:
“వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు.
వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది.”#9:9 కీర్తన 112:9
10విత్తువానికి విత్తనాలు, తినడానికి రొట్టె సమకూర్చే దేవుడు, మీకు విత్తనం దయచేసి మీ విత్తనాల నిల్వను వృద్ధి చేస్తాడు, మీ నీతి అనే పంటను విస్తారంగా ఇస్తాడు. 11మీరు ప్రతి సమయంలో ఉదారంగా ఇవ్వడానికి మీరు అన్నిరకాలుగా సంపన్నులు అవుతారు, మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి.
12మీరు చేసే ఈ పరిచర్య కేవలం ప్రభువు ప్రజల అవసరాలకు అందించడమే కాదు కాని అనేక విధాలుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో అత్యధికమవుతుంది. 13ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు, క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కొరకు, వారితో మరియు అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. 14దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి, వారు మీ కొరకు ప్రార్థించినప్పడు వారి హృదయాలు మిమ్మల్ని చూడాలని ఆశపడతాయి. 15చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 కొరింథీ 9: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.