ఎజ్రా 10

10
ప్రజలు తమ పాపం ఒప్పుకొనుట
1ఎజ్రా దేవుని మందిరం ఎదుట నేలమీద పడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు పెద్ద సమూహంగా అతని చుట్టూ చేరి వారు కూడా బిగ్గరగా ఏడ్చారు. 2అప్పుడు ఏలాము వారసులలో ఒకడైన యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో, “మా చుట్టూ ఉన్న ప్రజల నుండి పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహం చేశాము. అయినా ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకుంటారనే నిరీక్షణ ఉంది. 3నా ప్రభువు సలహా ప్రకారం మన దేవుని ఆజ్ఞలకు భయపడేవారి సలహా ప్రకారం, ఈ స్త్రీలను వారి పిల్లలందరిని పంపించి వేయడానికి మన దేవుని ఎదుట ఒక నిబంధన చేద్దాము. ధర్మశాస్త్రం ప్రకారం ఇది జరగాలి. 4లెండి; ఈ పని మీ చేతిలోనే ఉంది. మేము మీకు మద్ధతు ఇస్తాం కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి” అన్నాడు.
5అప్పుడు ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులందరు ఆ మాట ప్రకారం చేసేలా వారితో ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేశారు. 6అప్పుడు ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి బయలుదేరి ఎల్యాషీబు కుమారుడైన యెహోహనాను గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు, ఎజ్రా అన్నపానాలు పుచ్చుకోలేదు ఎందుకంటే, చెరగొనిపోబడిన వారి నమ్మకద్రోహాన్ని బట్టి దుఃఖించాడు.
7చెర నుండి విడుదలై వచ్చిన వారంతా యెరూషలేములో సమావేశం కావాలని యూదాలో, యెరూషలేములో ప్రకటన చేశారు. 8ఎవరైనా మూడు రోజుల లోపు అధికారులు, పెద్దల నిర్ణయం ప్రకారం రాకపోతే, వారి ఆస్తి జప్తు చేయబడుతుంది. వారు చెర నుండి విడుదలై వచ్చిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారు.
9మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు. 10అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు. 11ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించండి, ఆయన చిత్తం చేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల నుండి, మీ పరాయి దేశపు భార్యల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి” అని చెప్పాడు.
12అప్పుడు అక్కడ చేరి ఉన్నవారందరు స్పందిస్తూ బిగ్గరగా ఇలా అన్నారు: “నీవు చెప్పింది సరియైనది! నీవు చెప్పినట్లు మేము చేయాలి. 13అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద వర్షం కురుస్తుండడం వలన మేము బయట నిలబడలేము. అంతేకాక, ఇది ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే విషయం కాదు ఎందుకంటే, ఈ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాము. 14కాబట్టి ఈ సమాజమంతటి పక్షంగా మా అధికారులు నిలబడాలి. అప్పుడు ఈ విషయంలో మన దేవుని తీవ్రమైన కోపం మన నుండి తొలగిపోయే వరకు మన పట్టణాల్లో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న ప్రతివారు నిర్ణయించిన సమయంలో ప్రతి పట్టణపు పెద్దలతో, న్యాయాధిపతులతో రావాలి.” 15దీనిని కేవలం అశాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యాలు మెషుల్లాము, లేవీయుడైన షబ్బెతై అనేవారి మద్దతుతో దీన్ని వ్యతిరేకించారు.
16కాబట్టి నిర్ణయించిన ప్రకారం చెర నుండి విడుదలైన వారు చేశారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా, కుటుంబ పెద్దలైన వారిని ప్రతి కుటుంబం నుండి ఒకరు చొప్పున, వారి వారి పేర్లను బట్టి ఎన్నుకున్నాడు. ఈ విషయం పరిశీలించటానికి పదవనెల మొదటి రోజున వారంతా కూర్చున్నారు. 17మొదటి నెల మొదటి రోజుకి పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారందరి విషయాన్ని పరిష్కరించడం జరిగింది.
వియ్యమందుకుని అపరాధులుగా ఉన్నవారు
18యాజకుల వారసులలో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారు వీరు:
యోజాదాకు కుమారుడైన యెషూవ వారసులు, అతని సహోదరుల నుండి:
మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. 19(వీరంతా తమ భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తమ దోషాన్ని బట్టి అపరాధపరిహారబలిగా ఒక్కొక్కరు మందలో ఒక్కొక్క పొట్టేలు అర్పించారు.)
20ఇమ్మేరు వారసుల నుండి:
హనానీ, జెబద్యా.
21హారీము వారసుల నుండి:
మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
22పషూరు వారసుల నుండి:
ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
23లేవీయుల నుండి:
యోజాబాదు, షిమీ, కెలిథా అనే కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
24సంగీతకారుల నుండి:
ఎల్యాషీబు.
ద్వారపాలకుల నుండి:
షల్లూము, తెలెము, ఊరి.
25ఇతర ఇశ్రాయేలీయుల నుండి:
పరోషు వారసుల నుండి:
రమ్యా, ఇజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియాజరు, మల్కీయా, బెనాయా.
26ఏలాము వారసుల నుండి:
మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.
27జత్తూ వారసుల నుండి:
ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
28బేబై వారసుల నుండి:
యెహోహనాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
29బానీ వారసుల నుండి:
మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు షెయాలు, యెరేమోతు.
30పహత్-మోయాబు వారసుల నుండి:
అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
31హారీము వారసుల నుండి:
ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమ్యోను, 32బెన్యామీను, మల్లూకు, షెమర్యా.
33హాషుము వారసుల నుండి:
మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీఫెలెతు, యెరేమై, మనష్షే, షిమీ.
34బానీ వారసుల నుండి:
మయదై, అమ్రాము, ఊయేలు, 35బెనాయా, బేద్యా, కెలూహు, 36వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు 37మత్తన్యా, మత్తెనై, యయశావు.
38బానీ బిన్నూయి వారసుల నుండి:
షిమీ, 39షెలెమ్యా, నాతాను, అదాయా, 40మక్నద్బయి, షాషై, షారాయి, 41అజరేలు, షెలెమ్యా, షెమర్యా, 42షల్లూము, అమర్యా, యోసేపు.
43నెబో వారసుల నుండి:
యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.
44వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. వారిలో కొందరికి ఈ భార్యల#10:44 లేదా వారి పిల్లలతో పాటు వారిని పంపించేశారు వలన పిల్లలు కూడా పుట్టారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎజ్రా 10: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి