యోబు 18
18
బిల్దదు
1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:
2“నీవు ఈ మాటలు మాట్లాడడం ఎప్పుడు మానేస్తావు?
కొంచెం ఆలోచించు, అప్పుడు మేము మాట్లాడతాము.
3నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా
తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము?
4కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు,
నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా?
నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా?
5“దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది;
వారి అగ్నిజ్వాలలు మండవు.
6వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది;
వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
7వారి బలమైన అడుగులు బలహీనపడతాయి;
వారి సొంత ఆలోచనలే వారిని పడగొడతాయి.
8వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి;
వారు వలలో పడతారు.
9బోను వారి మడమను పట్టుకుంటుంది;
ఉచ్చు వారిని గట్టిగా పట్టుకుంటుంది.
10వారి కోసం నేల మీద ఉరి అమర్చబడింది;
వారి దారిలో ఉచ్చు ఉంది.
11భయాలు ప్రతి దిక్కునుండి వారిని ఆవరిస్తాయి,
అడుగడుగునా వారిని వెంటాడతాయి.
12విపత్తు వారి కోసం ఆకలితో ఉంది;
వారు పడిపోతే ఆపద వారి కోసం సిద్ధంగా ఉంది.
13అది వారి చర్మ భాగాలను తినివేస్తుంది;
మరణం యొక్క మొదటి సంతానం వారి అవయవాలను మ్రింగివేస్తుంది.
14వారి గుడారంలో ఉన్న భద్రత నుండి వారు పెరికివేయబడ్డారు.
భయం కలిగించే రాజు దగ్గరకు కొనిపోబడతారు.
15అగ్ని వారి గుడారంలో నివసిస్తుంది.#18:15 లేదా అతని దగ్గర ఉన్నది ఏది మిగలదు
వారి నివాసం మీద మండే గంధకం చెదిరిపోతుంది.
16క్రింద వారి వేర్లు ఎండిపోతాయి
పైన వారి కొమ్మలు వాడిపోతాయి.
17భూమి మీద వారి జ్ఞాపకం నశించిపోతుంది;
నేలమీద వారి పేరే ఉండదు.
18వెలుగులో నుండి చీకటిలోకి వారు నడిపించబడతారు
లోకం నుండి వారు తరిమివేయబడతారు.
19తమ ప్రజల్లో వారికి సంతానం గాని వారసులు గాని ఉండరు,
ఒకప్పుడు వారు నివాసమున్న స్థలాల్లో బ్రతికి ఉన్నవారు ఎవరు లేరు.
20వారి దుస్థితిని చూసిన పశ్చిమ ప్రజలు ఆందోళన చెందుతారు;
తూర్పున ఉన్నవారు భయంతో నిండి ఉంటారు.
21ఖచ్చితంగా దుర్మార్గుల నివాసం ఇలాగే ఉంటుంది;
దేవుని ఎరుగనివారి స్థలం కూడా ఇలానే ఉంటుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 18: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.