అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డారు. నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత, ఆయనకు ఆకలివేసింది. శోధకుడు యేసు దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకొనివెళ్ళి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, క్రిందికి దూకు, ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదాలకు ఒక రాయి కూడా తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొంటారు,’” అని అన్నాడు. అందుకు యేసు వానితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు. మరల, అపవాది ఆయనను చాలా ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకువెళ్లి ప్రపంచంలోని రాజ్యాలన్నిటిని వైభవాన్ని ఆయనకు చూపించాడు. వాడు యేసుతో, “నీవు నా ముందు తలవంచి నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు. అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! ఎందుకంటే, నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు. అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు, దూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
Read మత్తయి 4
వినండి మత్తయి 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 4:1-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు