సంఖ్యా 33
33
ఇశ్రాయేలు ప్రయాణ దశలు
1ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు. 2యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారి ప్రయాణాల దశలను నమోదు చేశాడు. ఇవి వారి ప్రయాణాల దశలు:
3-4ఇశ్రాయేలీయులు మొదటి నెల పదిహేనవ రోజు అంటే పస్కా తర్వాత రోజున, రామెసేసు నుండి ప్రయాణమయ్యారు. యెహోవా హతం చేసిన తమ జ్యేష్ఠులందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూ ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉండగా జయోత్సాహంతో బయలుదేరారు; ఎందుకంటే యెహోవా వారి దేవుళ్ళ మీద తీర్పు తీర్చారు.
5ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు.
6వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు.
7వారు ఏతాము నుండి వెనుకకు తిరిగి బయల్-సెఫోను ఎదురుగా పీ హహీరోతు వైపుకు వెళ్లి మిగ్దోలు ఎదుట దిగారు.
8పీ హహీరోతు నుండి బయలుదేరి సముద్రం గుండా దాటుతూ ఎడారిలోకి చేరారు, వారు మూడు రోజులు ఏతాము ఎడారిలో ప్రయాణం చేసి మారాలో దిగారు.
9మారా నుండి బయలుదేరి ఎలీముకు వెళ్లారు, ఎలీములో పన్నెండు నీటి ఊటలు, డెబ్బయి ఈతచెట్లు ఉన్నాయి, వారక్కడ ఉన్నారు.
10ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు.
11ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.
12సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు.
13దోపకా నుండి బయలుదేరి ఆలూషుకు వచ్చారు.
14ఆలూషు నుండి బయలుదేరి రెఫీదీముకు వచ్చారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.
15రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చారు.
16సీనాయి ఎడారి నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
17కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు.
18హజేరోతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు.
19రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను పెరెజుకు వచ్చారు.
20రిమ్మోను పెరెజు నుండి బయలుదేరి లిబ్నాకు వచ్చారు.
21లిబ్నా నుండి బయలుదేరి రీసాకు వచ్చారు.
22రీసా నుండి బయలుదేరి కేహేలాతాకు వచ్చారు.
23కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు.
24షాపెరు పర్వతము నుండి బయలుదేరి హరాదాకు వచ్చారు.
25హరాదా నుండి బయలుదేరి మకెలోతుకు వచ్చారు.
26మకెలోతు నుండి బయలుదేరి తాహతుకు వచ్చారు.
27తాహతు నుండి బయలుదేరి తారహుకు వచ్చారు.
28తారహు నుండి బయలుదేరి మిత్కాకు వచ్చారు.
29మిత్కా నుండి బయలుదేరి హష్మోనాకు వచ్చారు.
30హష్మోనా నుండి బయలుదేరి మొసేరోతుకు వచ్చారు.
31మొసేరోతు నుండి బయలుదేరి బెనె యహకానుకు వచ్చారు.
32బెనె యహకాను నుండి బయలుదేరి హోర్-హగ్గిద్గాదుకు వచ్చారు.
33హోర్-హగ్గిద్గాదు నుండి బయలుదేరి యొత్బాతాకు వచ్చారు.
34యొత్బాతా నుండి బయలుదేరి ఎబ్రోనాకు వచ్చారు.
35ఎబ్రోనా నుండి బయలుదేరి ఎసోన్-గెబెరుకు వచ్చారు.
36ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు.
37కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు. 38యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడైన అహరోను హోరు పర్వతం మీద చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన నలభైయవ సంవత్సరం, అయిదవ నెల, మొదటి రోజున అతడు చనిపోయాడు. 39హోరు పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతని వయస్సు నూట యిరవై మూడు సంవత్సరాలు.
40కనాను దక్షిణ దిక్కున కనానీయుడైన అరాదు పట్టణ రాజు ఇశ్రాయేలీయులు వస్తున్నారని విన్నాడు.
41వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు.
42సల్మానా నుండి బయలుదేరి పూనొనుకు వచ్చారు.
43పూనొను నుండి బయలుదేరి ఓబోతుకు వచ్చారు.
44ఓబోతు నుండి బయలుదేరి మోయాబు సరిహద్దులో ఉన్న ఈయ్యె-అబారీముకు వచ్చారు.
45ఈయ్యె-అబారీము నుండి బయలుదేరి దీబోనుగాదుకు వచ్చారు.
46దీబోనుగాదు నుండి బయలుదేరి అల్మోన్-దిబ్లాతయీముకు వచ్చారు.
47అల్మోన్-దిబ్లాతయీము నుండి బయలుదేరి నెబో ఎదుట ఉన్న అబారీము పర్వతాల దగ్గర దిగారు.
48అబారీము పర్వతాల నుండి బయలుదేరి యెరికోకు దగ్గర యొర్దాను అవతలి వైపున మోయాబు సమతల మైదానాల్లో దిగారు. 49మోయాబు సమతల మైదానంలో బేత్-యెషిమోతు మొదలుకొని ఆబేల్-షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగారు.
50యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు, 51“ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు, 52ఆ దేశవాసులందర్నీ తరిమేయాలి. వారి రాతి విగ్రహాలను, కోట విగ్రహాలను నాశనం చేయాలి వారి క్షేత్రాలను పడగొట్టాలి. 53ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించండి ఎందుకంటే మీరు స్వాధీనపరచుకోడానికి ఆ దేశాన్ని మీకు ఇచ్చాను. 54చీట్లు వేసి మీ వంశాల ప్రకారం ఆ దేశాన్ని పంచుకోండి. పెద్ద గోత్రాలకు ఎక్కువ వారసత్వం చిన్న గోత్రాలకు తక్కువ వారసత్వంగా పంచుకోండి. చీట్లలో ఏది వస్తే, అది వారికి చెందుతుంది. మీ పూర్వికుల గోత్రాల ప్రకారం దానిని పంచుకోండి.
55“ ‘అయితే ఆ దేశవాసులను మీరు తరిమివేయకపోతే, అక్కడ ఉండడానికి అనుమతించిన వారు మీ కళ్లలో ముళ్ళుగా, మీ ప్రక్కలలో శూలాలుగా చేసినవారవుతారు. మీరు నివసించే భూమిలో వారు మిమ్మల్ని కష్ట పెడతారు. 56అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 33: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.