కీర్తనలు 112
112
కీర్తన 112#112 ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.
1యెహోవాను స్తుతించండి.#112:1 హెబ్రీలో హల్లెలూయా
యెహోవాకు భయపడేవారు ధన్యులు,
వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు.
2వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు;
యథార్థవంతుల తరం దీవించబడుతుంది.
3వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి,
వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది.
4దయ కనికరం గలవారికి నీతిమంతులకు,
యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది.
5దయతో అప్పు ఇచ్చేవారికి,
తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.
6నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు;
వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.
7దుర్వార్తల వలన వారు భయపడరు;
యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.
8వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు;
చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు.
9వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు,
వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది;
వారి కొమ్ము#112:9 కొమ్ము ఇక్కడ ఠీవిని సూచిస్తుంది. ఘనత పొంది హెచ్చింపబడుతుంది.
10దుష్టులు చూసి విసుగుచెందుతారు,
వారు పండ్లు కొరుకుతూ క్షీణించి పోతారు;
దుష్టుల ఆశలు విఫలమవుతాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 112: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.