కీర్తనలు 124

124
కీర్తన 124
దావీదు యాత్రకీర్తన.
1-5మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు
వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు
యెహోవా మనకు తోడై ఉండకపోతే
వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు;
వరద మన మీదుగా పొర్లి ఉండేది,
జలప్రవాహం మనల్ని ముంచేసి
జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది
అని ఇశ్రాయేలు చెప్పును గాక.
6వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని
యెహోవాకు స్తుతి చెల్లును గాక.
7వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా
మనం తప్పించుకున్నాము;
ఉరి తెగిపోయింది,
మనం తప్పించుకున్నాము.
8భూమ్యాకాశాలను సృజించిన
యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 124: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి