కీర్తనలు 127

127
కీర్తన 127
సొలొమోను యాత్రకీర్తన.
1యెహోవా ఇల్లు కడితేనే తప్ప
దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే.
యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే
దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.
2మీరు ప్రొద్దున్నే లేచి
ఆలస్యంగా పడుకొంటూ,
కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే.
ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.
3పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం,
గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
4యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు
వీరుని చేతిలో బాణాలవంటివారు.
5వారితో తన అంబులపొదిని
నింపుకున్నవాడు ధన్యుడు.
గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు
వారు అవమానం పొందరు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 127: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి