కీర్తనలు 136

136
కీర్తన 136
1యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు.
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
2దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
3ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి:
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
4మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
5ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
6నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి.
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
7మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
8పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
9రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
10ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు,
ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
11వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
12చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
13ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
14దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
15ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
16అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
17గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
18బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
19అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
20బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
21వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
22తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
23మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
24మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
25ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
26పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి,
ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 136: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి