కీర్తనలు 25
25
కీర్తన 25#25 ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి
దావీదు కీర్తన.
1యెహోవా, నా దేవా,
నేను మీపై నమ్మిక ఉంచాను.
2నా దేవా, నేను మిమ్మల్ని నమ్ముతాను;
నాకు అవమానం కలగనివ్వకండి,
నా శత్రువులకు నాపై విజయాన్ని ఇవ్వకండి.
3మీ కోసం ఎదురు చూసే వారెవరూ
ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు,
కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు
అవమానం వస్తుంది.
4యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి.
మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.
5మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి,
మీరే నా రక్షకుడవైన నా దేవుడవు,
మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.
6యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి,
ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.
7యవ్వనంలో నేను చేసిన పాపాలు,
నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి;
మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి.
ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.
8యెహోవా మంచివాడు యథార్థవంతుడు;
కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు.
9న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు,
తన మార్గాలను వారికి బోధిస్తారు.
10తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో
యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి.
11యెహోవా, నా దోషం ఘోరమైనది
మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి.
12అప్పుడు యెహోవాకు భయపడేవారికి
వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు.
13వారు క్షేమం కలిగి జీవిస్తారు,
వారి వారసులు భూమిని వారసత్వంగా పొందుతారు.
14ఆయన పట్ల భయభక్తులు గలవారికి యెహోవా రహస్యాలు తెలుస్తాయి;
ఆయన తన నిబంధనను వారికి తెలియపరుస్తారు.
15నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి,
ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు.
16నా వైపు తిరిగి నాపై దయ చూపండి,
నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను.
17నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి
నా వేదన నుండి విడిపించండి.
18నా వేదన బాధను చూడండి
నా పాపాలన్నిటిని క్షమించండి.
19నా శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడండి
వారు ఎంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారో చూడండి!
20నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి;
నాకు అవమానం కలగనివ్వకండి,
ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను.
21నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది,
కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.
22దేవా, ఇశ్రాయేలు ప్రజలను
వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 25: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.