కీర్తనలు 27
27
కీర్తన 27
దావీదు కీర్తన.
1యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ
నేను ఎవరికి భయపడతాను?
దేవుడే నా జీవితానికి బలమైన కోట
నేను ఎవరికి భయపడతాను?
2నన్ను మ్రింగివేయాలని
దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు,
నా శత్రువులు నా పగవారు
తూలి పడిపోతారు.
3సైన్యం నన్ను ముట్టడించినా,
నా హృదయం భయపడదు;
నా మీదికి యుద్ధానికి వచ్చినా,
నేను ధైర్యం కోల్పోను.
4యెహోవాను ఒకటి అడిగాను,
నేను కోరింది ఇదే;
యెహోవా ప్రసన్నతను చూస్తూ
ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ
నా జీవితకాలమంతా
నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.
5ఆపద సంభవించిన దినాన
ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు;
తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు,
ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.
6నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే,
నా తల పైకెత్తబడుతుంది
ఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను;
నేను పాడి యెహోవాను స్తుతిస్తాను.
7యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి;
నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి.
8“ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది,
యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.
9మీ ముఖాన్ని నా నుండి దాచకండి,
కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి;
మీరే నాకు సహాయము.
దేవా నా రక్షకా,
నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి.
10నా తల్లిదండ్రులు నన్ను విడిచినా,
యెహోవా నన్ను చేరదీస్తారు.
11యెహోవా, మీ మార్గం నాకు బోధించండి;
నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు,
కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.
12నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి,
ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి,
హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు.
13నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను:
సజీవులన్న చోట
నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను.
14యెహోవా కోసం కనిపెట్టండి
నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి
యెహోవా కోసం కనిపెట్టండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 27: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.