ప్రకటన 8

8
ఏడవ ముద్ర మరియు ధూపం వేసే బంగారు పాత్ర
1ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు అక్కడ పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండింది.
2అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూసాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి.
3ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకొన్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి గొప్ప పరిమాణంలో ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి. 4అప్పుడు దూత చేతి నుండి ఆ ధూపద్రవ్యాల పొగ దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిసి మీదికి లేచి దేవుని సన్నిధికి చేరింది. 5ఆ దూత బలిపీఠం నుండి తీసిన అగ్నితో ధూపం వేసే పాత్రను నింపి దాన్ని భూమి మీదికి విసిరివేశాడు. అప్పుడు గర్జన లాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల ధ్వనులు, భూకంపం వచ్చాయి.
ఏడు బూరలు
6అప్పుడు ఏడు బూరలను పట్టుకొని ఉన్న ఆ ఏడు దూతలు వాటిని ఊదడానికి సిద్ధపడ్డారు.
7మొదటి దూత తన బూరను ఊదినప్పుడు రక్తంతో కలిసి ఉన్న అగ్ని వడగండ్లు భూమి మీదికి కురిసాయి. అప్పుడు భూమి మూడో భాగం, చెట్లలో మూడో భాగం, పచ్చని గడ్డంతా కాలిపోయింది.
8రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నితో మండుతున్న పర్వతం లాంటిది సముద్రంలో పడవేయబడింది. అప్పుడు సముద్రంలోని మూడో భాగం రక్తంగా మారింది. 9దానితో సముద్రంలోని మూడవ భాగం ప్రాణులు చనిపోయాయి. ఇంకా ఓడల్లో మూడవ భాగం నాశనమయ్యాయి.
10మూడవ దూత తన బూరను ఊదినప్పుడు దివిటీలా ప్రకాశిస్తున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటలలో పడింది. 11ఆ నక్షత్రం పేరు “చేదు”#8:11 చేదు మాచిపత్రి అది పడినప్పుడు మూడో భాగపు నీరు చేదుగా మారింది. ఆ చేదు నీటిని బట్టి చాలామంది చనిపోయారు.
12నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడో భాగం, చంద్రుని మూడో భాగం, నక్షత్రాల మూడో భాగం కొట్టబడింది. కనుక అవన్ని మూడో భాగం వెలుగును కోల్పోయాయి. పగటివేళలో మూడో భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడో భాగం వెలుగు లేకుండా పోయింది.
13నేను చూస్తూ వుండగా ఒక పక్షిరాజు మధ్య ఆకాశంలో ఎగురుతూ పెద్ద స్వరంతో “అయ్యో, విపత్తు! విపత్తు! విపత్తు! భూనివాసులకు విపత్తు, ఎందుకనగా మిగతా ముగ్గురు దేవదూతలు బూరల ధ్వని చేయబోతున్నారు” అని అరుస్తుంటే నేను విన్నాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ప్రకటన 8: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి