1 రాజులు 16
16
1బయెషా గురించి హనానీ కుమారుడైన యెహుకు యెహోవా నుండి వచ్చిన వాక్కు: 2“నేను నిన్ను మట్టిలో నుండి పైకి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా చేశాను. అయితే నీవు యరొబాము విధానాలను అనుసరించి, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపం చేసేలా చేసి, వారి పాపాలను బట్టి నాకు కోపం రేపావు. 3కాబట్టి నేను బయెషాను, అతని వంశాన్ని తుడిచివేస్తాను. నీ ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా చేస్తాను. 4బయెషాకు సంబంధించిన వారిలో ఎవరు పట్టణంలో చనిపోతారో వారిని కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.”
5బయెషా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసింది, అతడు సాధించిన విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 6బయెషా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. తిర్సాలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఏలహు రాజయ్యాడు.
7అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు.
ఇశ్రాయేలు రాజైన ఏలహు
8యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఆరవ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలహు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు తిర్సాలో రెండేళ్ళు పరిపాలించాడు.
9ఏలహు యొక్క రథాలు సగభాగం మీద అధికారి, అతని సేవకులలో ఒకడైన జిమ్రీ, అతని మీద కుట్రపన్నాడు. ఆ సమయంలో ఏలహు, తిర్సాలో అతని గృహనిర్వాహకుడైన అర్సా ఇంట్లో, బాగా త్రాగుతూ ఉన్నాడు. 10జిమ్రీ లోపలికి వచ్చి, అతన్ని మొత్తి చంపాడు, అతని తర్వాత అతడు రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఇరవై ఏడవ ఏట పరిపాలనలో జరిగింది.
11జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే అతడు బయెషా కుటుంబం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో, మిత్రులలో మగవారిని ఒక్కరిని కూడ వదలకుండా చంపాడు. 12యెహోవా యెహు ప్రవక్త ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం జిమ్రీ బయెషా వంశం అంతటిని నిర్మూలం చేశాడు. 13బయెషా అతని కుమారుడైన ఏలహు చేసిన పాపాలన్నిటిని బట్టి, వారు ఇశ్రాయేలుతో చేయించిన పాపాన్ని బట్టి, వారి అయోగ్యమైన విగ్రహాలనుబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపారు.
14ఏలహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
ఇశ్రాయేలు రాజైన జిమ్రీ
15యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఏడవ సంవత్సరంలో జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పరిపాలించాడు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోను అనే పట్టణం ముట్టడించారు. 16జిమ్రీ కుట్రపన్ని రాజును చంపేశాడని ఇశ్రాయేలీయులు విన్నప్పుడు సేనాధిపతియైన ఒమ్రీని ఇశ్రాయేలుకు రాజుగా చేశారు. 17అప్పుడు ఒమ్రీ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులంతా గిబ్బెతోనును విడిచివెళ్లి తిర్సాను ముట్టడించారు. 18పట్టణం ఆక్రమించబడిందని జిమ్రీ చూసి, అతడు రాజభవనం లోనికి వెళ్లి, తనతోపాటు దాన్ని తగలబెట్టి చనిపోయాడు. 19యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ యెహోవా దృష్టిలో పాపం చేసి, యరొబాములా ఇశ్రాయేలు ప్రజల పాపం చేయడానికి అతడు కారణమయ్యాడు కాబట్టి ఇలా జరిగింది.
20జిమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని తిరుగుబాటు వివరాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ
21అప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలో ప్రజలు రెండు వర్గాలయ్యారు; సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీ రాజుగా ఉండాలని, మరో సగం ఒమ్రీ రాజుగా ఉండాలని ఆశించారు. 22అయితే ఒమ్రీ వైపు ఉన్నవారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షం వారి మీద యుద్ధం చేసి గెలిచారు. కాబట్టి తిబ్నీ చనిపోయాడు, ఒమ్రీ రాజయ్యాడు.
23యూదా రాజైన ఆసా పరిపాలన యొక్క ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండు సంవత్సరాల పరిపాలనలో ఆరు సంవత్సరాలు తిర్సాలో పరిపాలన చేశాడు. 24అతడు షెమెరు దగ్గర సమరయ కొండను రెండు తలాంతుల#16:24 అంటే సుమారు 68 కి. గ్రా. లు వెండికి కొని దాని మీద పట్టణం కట్టించి, ఆ కొండకు మునుపటి యజమానియైన షెమెరు పేరిట దానికి సమరయ అని పేరు పెట్టాడు.
25అయితే ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతని ముందున్న వారందరికంటే ఇంకా ఎక్కువ పాపం చేశాడు. 26అతడు నెబాతు కుమారుడైన యరొబాము ఎలా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమై తమ అయోగ్యమైన విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడో అదే విధానాన్ని అనుసరించాడు.
27ఒమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 28ఒమ్రీ చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహాబు రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన అహాబు
29యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 30ఒమ్రీ కుమారుడైన అహాబు అతని ముందున్న వారందరికంటే యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించాడు. 31అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు. 32అతడు సమరయలో బయలు గుడిని కట్టించి, అందులో బయలుకు బలిపీఠాన్ని నిర్మించాడు. 33అహాబు అషేరా స్తంభాలను కూడా నిలిపి, ముందు ఉన్న ఇశ్రాయేలు రాజులందరికి కంటే ఎక్కువగా పాపం చేసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.
34అహాబు కాలంలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టించాడు. దాని పునాది వేసినప్పుడు అతని పెద్దకుమారుడైన అబీరాము చనిపోయాడు, దానికి గుమ్మాలు పెట్టినప్పుడు అతని చిన్నకుమారుడు సెగూబు చనిపోయాడు. ఈ విధంగా నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 16: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: