1 రాజులు 17
17
ఏలీయా గొప్ప కరువును ప్రకటించుట
1గిలాదు ప్రాంతంలోని తిష్బీ#17:1 లేదా తిష్బీ గ్రామవాసి స్థిరపడినవారిలో ఒకడు గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”
ఏలీయాకు కాకులు ఆహారం అందించుట
2తర్వాత యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది: 3“ఈ స్థలం విడిచి, తూర్పు వైపుకు వెళ్లి, యొర్దానుకు తూర్పున, కెరీతు వాగు దగ్గర దాక్కో. 4నీవు ఆ వాగు నీళ్లు త్రాగు, అక్కడ నీకు ఆహారం అందించాలని కాకులకు ఆదేశించాను.”
5కాబట్టి యెహోవా చెప్పినట్లు ఏలీయా చేశాడు, అతడు యొర్దానుకు తూర్పున ఉన్న కెరీతు వాగు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాడు. 6ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి, అతడు ఆ వాగు నీళ్లు త్రాగేవాడు.
ఏలీయా సారెపతు విధవరాలు
7కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది. 8అప్పుడు యెహోవా వాక్కు అతనికి వచ్చింది: 9“నీవు లేచి, సీదోనుకు చెందిన సారెపతుకు వెళ్లి, అక్కడ ఉండు. అక్కడ ఆహారం పెట్టాలని ఒక విధవరాలికి ఆదేశించాను.” 10కాబట్టి అతడు లేచి సారెపతుకు వెళ్లాడు. పట్టణ ద్వారం దగ్గరకు చేరగానే, అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటూ కనిపించింది. అతడు ఆమెను పిలిచి, “త్రాగడానికి నాకు గిన్నెలో నీళ్లు తెస్తావా?” అని అడిగాడు. 11ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే, అతడు పిలిచి, “దయచేసి ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా” అన్నాడు.
12అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది.
13ఏలీయా ఆమెతో, “భయపడకు. ఇంటికి వెళ్లి నేను నీకు చెప్పినట్లు చేయు. మొదట నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురా, తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకో. 14ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు.
15ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది. 16ఎందుకంటే ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం జాడీలో పిండి తరిగిపోలేదు, కూజలో నూనె అయిపోలేదు.
17కొంతకాలం తర్వాత ఇంటి యజమానురాలి కుమారునికి జబ్బుచేసింది. ఆ జబ్బు తీవ్రమైనందుకు అతడు ప్రాణం విడిచాడు. 18ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?”
19ఏలీయా జవాబిస్తూ, “నీ కుమారున్ని నాకు ఇవ్వు” అన్నాడు. ఆమె చేతిలో నుండి అతన్ని తీసుకుని, తాను ఉంటున్న మేడ గదికి తీసుకెళ్లి, తన పడక మీద పడుకోబెట్టాడు. 20తర్వాత అతడు యెహోవాకు మొరపెడుతూ అన్నాడు, “యెహోవా నా దేవా, నేను ఎవరి ఇంట్లో అతిథిగా ఉంటున్నానో ఆ విధవరాలి కుమారున్ని చనిపోయేలా చేసి, ఆమెకు కూడా విషాదాన్ని కలిగించారా?” 21తర్వాత అతడు ఆ బాలుని మీద మూడుసార్లు చాచుకొని, “యెహోవా, నా దేవా! ఈ బాలునికి ప్రాణం తిరిగి రానివ్వండి!” అని యెహోవాకు మొరపెట్టాడు.
22ఏలీయా చేసిన ప్రార్థన యెహోవా విన్నారు, బాలునికి ప్రాణం తిరిగి వచ్చింది, అతడు బ్రతికాడు. 23ఏలీయా ఆ బాలున్ని ఎత్తుకుని ఆ గది నుండి క్రింద ఇంట్లోకి తీసుకువచ్చి, ఆ బాలుని తల్లి చేతికి ఇస్తూ, “చూడు, నీ కుమారుడు సజీవంగా ఉన్నాడు” అన్నాడు.
24అప్పుడు ఆ స్త్రీ ఏలీయాతో, “ఇప్పుడు మీరు దైవజనులని, మీ నోట ఉన్న యెహోవా వాక్కు సత్యమని నాకు తెలిసింది” అన్నది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 17: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: