2 దినవృత్తాంతములు 26

26
యూదా రాజైన ఉజ్జియా
1అప్పుడు యూదా ప్రజలందరూ పదహారు సంవత్సరాల వయస్సు వాడైన ఉజ్జియాను#26:1 లేదా అజర్యా అని కూడా పిలువబడేవాడు అతని తండ్రియైన అమజ్యా స్థానంలో రాజుగా చేశారు. 2రాజైన అమజ్యా చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరిన తర్వాత ఉజ్జియా ఏలతును పునర్నిర్మించి తిరిగి యూదాకు కలిపాడు.
3ఉజ్జియా రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. ఆమె యెరూషలేముకు చెందినది. 4అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. 5దేవుని భయం#26:5 చాలా హెబ్రీ ప్రతులలో, కొ.ప్ర.లలో దర్శనం కలిగి ఉండాలని తనకు బోధించిన జెకర్యా దినాల్లో అతడు దేవున్ని అనుసరించాడు. అతడు యెహోవాను అనుసరించినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చారు.
6అతడు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లి గాతు, జబ్నె, అష్డోదు పట్టణాల గోడలు పడగొట్టాడు. అష్డోదు ప్రాంతంలో, ఫిలిష్తీయుల మధ్య ఉన్న పట్టణాలను తిరిగి కట్టించాడు. 7ఫిలిష్తీయులతో గూర్-బయలులో ఉన్న అరబీయులతో మెయునీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశారు. 8అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించేవారు. అతడు చాలా శక్తివంతంగా అభివృద్ధి చెందాడు కాబట్టి, అతని గొప్పతనం ఈజిప్టు సరిహద్దు వరకు వ్యాపించింది.
9ఉజ్జియా యెరూషలేములో మూల ద్వారం దగ్గర, లోయ ద్వారం దగ్గర, ప్రాకారం మూల దగ్గర బురుజులు నిర్మించి వాటిని పటిష్టం చేశాడు. 10అతడు అరణ్యంలో బురుజులు కూడా నిర్మించాడు అనేక తొట్టెలను తవ్వాడు, ఎందుకంటే అతనికి పర్వత ప్రాంతాల్లో మైదానంలో చాలా పశువులు ఉన్నాయి. అతడు మట్టిని ప్రేమిస్తున్నందున కొండల్లో సారవంతమైన భూములలో తన పొలాలను ద్రాక్షతోటలను పని చేసేవారిని కలిగి ఉన్నాడు.
11ఉజ్జియాకు సుశిక్షితులైన సైన్యం ఉంది, రాజ అధికారులలో ఒకరైన హనన్యా ఆధ్వర్యంలో కార్యదర్శియైన యెహీయేలు అధికారియైన మయశేయా వారిని లెక్కించిన ప్రకారం విభాగాలుగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. 12ఆ యుద్ధవీరులపై 2,600 మంది అధికారులున్నారు. వారంతా పూర్వికుల కుటుంబాల పెద్దలు. 13యుద్ధానికి బాగా శిక్షణ పొందిన 3,07,500 మంది వారి చేతి క్రింద ఉన్నారు. రాజుకు అతని శత్రువు పోరాడడానికి సహాయం చేయగల బలమైన సైన్యం అది. 14ఉజ్జియా సైన్యమంతటికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు సరఫరాచేశాడు. 15యెరూషలేములో సైనికులు బాణాలు వేయడానికి గోడల నుండి పెద్ద రాళ్లను విసిరేందుకు వీలుగా అతడు బురుజులపై మూలల రక్షణ కోసం కనిపెట్టిన పరికరాలను తయారుచేశాడు. అతని కీర్తి చాలా దూరం వ్యాపించింది, ఎందుకంటే అతడు స్థిరపడేవరకు యెహోవా అతనికి ఎంతో సహాయం చేశారు.
16ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు. 17యాజకుడైన అజర్యా ఎనభైమంది ఇతర ధైర్యవంతులైన యెహోవా యాజకులతో అతన్ని అనుసరించాడు. 18వారు ఉజ్జియా రాజును ఎదిరించి, “ఉజ్జియా, యెహోవాకు ధూపం వెయ్యడం నీ పని కాదు. అహరోను వారసులైన యాజకులే ఆ పని చేయాలి. ధూపం వేయడానికి వారే ప్రతిష్ఠించబడ్డారు. పరిశుద్ధాలయం నుండి వెళ్లు. నీవు నమ్మకద్రోహిగా ఉన్నావు. దానివలన యెహోవా దేవుని వలన ఘనపరచబడవు” అన్నారు.
19ధూపం వేయడానికి చేతిలో ధూపం పెట్టుకున్న ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు యెహోవా మందిరంలో ధూపవేదిక ముందు యాజకుల సమక్షంలో వారి మీద విరుచుకుపడుతుండగా, అతని నుదుటిపై కుష్ఠురోగం#26:19 హెబ్రీలో కుష్ఠురోగం అనే పదం రకరకాల చర్మ వ్యాధులను సూచిస్తుంది. వచ్చింది. 20ముఖ్య యాజకుడైన అజర్యా ఇతర యాజకులందరు అతనివైపు చూసినప్పుడు, అతని నుదిటిపై కుష్ఠురోగం ఉందని వారు చూసి, అతన్ని త్వరితంగా బయటకు తీశారు. నిజమే, యెహోవా అతన్ని బాధపెట్టారు కాబట్టి అతడు స్వయంగా బయలుదేరడానికి ఆసక్తిగా ఉన్నాడు.
21ఉజ్జియా రాజు చనిపోయే రోజు వరకు కుష్ఠు వ్యాధితో ఉన్నాడు. అతనికున్న కుష్ఠురోగాన్ని బట్టి అతడు యెహోవా మందిరంలోనికి వెళ్లకుండ నిషేధించబడ్డాడు. కాబట్టి అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. అతని కుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.
22ఉజ్జియా పరిపాలన గురించిన ఇతర విషయాలు, ప్రారంభం నుండి చివరి వరకు, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తచేత నమోదు చేయబడ్డాయి. 23ఉజ్జియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, రాజులకు చెందిన స్మశానవాటికలో వారి సమీపంలో పాతిపెట్టబడ్డాడు, ఎందుకంటే, “అతనికి కుష్ఠువ్యాధి ఉంది” అని ప్రజలు అన్నారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 26: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి