2 సమూయేలు 6

6
మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం
1దావీదు మరలా ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సామర్థ్యంగల యువకులను సమకూర్చుకున్నాడు. 2కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యాల యెహోవా అని పిలువబడే దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, అతనితో ఉన్న మనుష్యులందరు యూదాలోని బయలాకు#6:2 అంటే, కిర్యత్-యారీము; 1 దిన 13:6 వెళ్లారు. 3-4వారు కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటి నుండి దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలుతుండగా అహియో దాని ముందు నడిచాడు. 5దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
6వారు నాకోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. 7ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా కోపం అతని మీద రగులుకుని దేవుడు అతన్ని మొత్తగా అతడు దేవుని మందసం ప్రక్కనే పడి చనిపోయాడు.
8యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా#6:8 పెరెజ్ ఉజ్జా అంటే ఉజ్జా నాశనం అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.
9ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి, “యెహోవా మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అనుకున్నాడు. 10యెహోవా మందసాన్ని తనతో పాటు దావీదు పట్టణానికి తీసుకెళ్లడానికి అతడు ఇష్టపడలేదు, కాబట్టి దావీదు దానిని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు. 11యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంట్లోనే మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటి వారినందరిని దీవించారు.
12“దేవుని మందసం ఇంట్లో ఉండడం వల్ల ఓబేద్-ఎదోము కుటుంబమంతటిని అతనికి ఉన్న వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించారు” అని రాజైన దావీదుకు తెలిసింది. దేవుని మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి దావీదు పట్టణానికి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు వెళ్లాడు. 13యెహోవా మందసాన్ని మోస్తున్న వ్యక్తులు నడిచేటప్పుడు దావీదు ప్రతి ఆరు అడుగులకు ఒక ఎద్దును, క్రొవ్విన దూడను బలిగా అర్పించాడు. 14దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు. 15ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.
16యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో రాజైన దావీదు గంతులు వేస్తూ నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.
17వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచారు, దావీదు యెహోవా సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించాడు. 18అతడు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, దావీదు సైన్యాల యెహోవా పేరిట ప్రజలను దీవించాడు. 19అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి ప్రతి స్త్రీకి పురుషునికి ఒక రొట్టె, కొంత మాంసం, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు. తర్వాత ప్రజలంతా ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు.
20తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు సౌలు కుమార్తె మీకాలు ఎదురు వచ్చి అతనితో, “ఇశ్రాయేలు రాజు తన సేవకులైన బానిస అమ్మాయిలు చూస్తుండగా ఒక పిచ్చివాడు చేసినట్లుగా ఈ రోజు బట్టలు విప్పి అర్థనగ్నంగా ఎంత గొప్పగా కనబడ్డాడో!” అని హేళనగా మాట్లాడింది.
21అందుకు దావీదు మీకాలుతో, “నీ తండ్రిని నీ తండ్రి ఇంటివారిని కాదని నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన యెహోవా సన్నిధిలో నేను ఆనందిస్తూ నాట్యం చేశాను. 22నేను ఇంతకన్నా ఎక్కువ అవమానపడినా నా దృష్టికి నేను తక్కువ వాడినైనా ఫర్వాలేదు, కాని నీవు చెప్తున్న బానిస అమ్మాయిల దృష్టిలో గౌరవించబడతాను” అన్నాడు.
23సౌలు కుమార్తె మీకాలుకు ఆమె చనిపోయే వరకు పిల్లలు పుట్టలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 6: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి