యెషయా 31
31
ఈజిప్టుపై ఆధారపడేవారికి శ్రమ
1ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా
యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ
సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి
గుర్రాలపై ఆధారపడేవారికి,
తమ రథాల సంఖ్యపై
గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.
2అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు;
ఆయన తన మాట వెనుకకు తీసుకోరు.
ఆయన దుష్టప్రజల మీద,
కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు.
3ఈజిప్టువారు కేవలం మనుష్యులే, దేవుడు కాదు;
వారి గుర్రాలు మాంసమే కాని ఆత్మ కాదు.
యెహోవా తన చేయి చాపగా
సహయం చేసేవారు తడబడతారు,
సహయం పొందేవారు పడతారు;
వారందరు కలిసి నాశనమవుతారు.
4యెహోవా నాతో చెప్పే మాట ఇదే:
తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి
ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా
వారి కేకలకు కలవరపడకుండా
సింహం ఒక కొదమసింహం
తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు
సైన్యాల యెహోవా
యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి
దాని కొండ మీదికి దిగి వస్తారు.
5అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా
సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు;
ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు.
దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు.
6ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి. 7మీ పాపిష్ఠి చేతులు తయారుచేసిన వెండి బంగారు విగ్రహాలను ఆ రోజున మీలో ప్రతి ఒక్కరు పారవేస్తారు.
8“మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది.
మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది.
వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారు
వారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు.
9వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది;
వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు”
అని యెహోవా ప్రకటించారు.
సీయోనులో ఆయన అగ్ని
యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 31: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: