యోబు 36

36
1ఎలీహు ఇంకా మాట్లాడుతూ:
2“ఇంకొంచెం సేపు నన్ను భరించండి
దేవుని పక్షాన చెప్పాల్సింది చాలా ఉందని మీకు తెలియజేస్తాను.
3నేను నా తెలివిని దూరం నుండి పొందాను;
నేను నా సృష్టికర్తకు న్యాయం ఆపాదిస్తాను.
4నా మాటలు అబద్ధం కాదని నమ్మండి;
పరిపూర్ణ జ్ఞాని మీతో ఉన్నాడు.
5“దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు;
ఆయన శక్తిమంతుడు, తన ఉద్దేశ్యంలో దృఢంగా ఉంటారు.
6ఆయన దుష్టులను బ్రతకనివ్వరు
కాని బాధితులకు న్యాయం చేస్తారు.
7నీతిమంతులను ఆయన చూడకపోరు;
వారిని రాజులతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టి
నిత్యం వారిని ఘనపరుస్తారు.
8ప్రజలు గొలుసులతో బంధించబడి,
బాధ అనే త్రాళ్లతో కట్టబడి ఉంటే,
9వారు అహంకారంతో పాపం చేశారని
ఆయన వారు చేసిన దానిని వారికి చెప్తారు.
10దిద్దుబాటును వినేలా చేస్తారు
తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడాలని వారిని ఆజ్ఞాపిస్తారు.
11ఒకవేళ వారు లోబడి ఆయనను సేవిస్తే,
వారు తమ మిగిలిన రోజులు క్షేమంగా
తమ సంవత్సరాలు సంతృప్తిగా గడుపుతారు.
12అయితే వారు వినకపోతే,
వారు ఖడ్గం చేత నశిస్తారు
జ్ఞానం లేకుండానే చనిపోతారు.
13“హృదయంలో భక్తిలేనివారు కోపాన్ని ఉంచుకుంటారు;
ఆయన వారిని బంధించినప్పుడు వారు సహాయం కోసం మొరపెట్టరు.
14వారు తమ యవ్వనకాలంలో చనిపోతారు,
పుణ్యక్షేత్రాల మగ వ్యభిచారుల మధ్య వారి జీవితం ముగుస్తుంది.
15బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు;
బాధల్లో ఆయన వారితో మాట్లాడతారు.
16“ఆయన నిన్ను బాధల్లో నుండి తప్పించి
పరిమితి లేని విశాలమైన ప్రదేశానికి,
మంచి ఆహారంతో నిండిన బల్ల దగ్గరకు నిన్ను తీసుకువస్తారు.
17కానీ ఇప్పుడు నీవు దుష్టుల తీర్పుతో నిండి ఉన్నావు;
తీర్పు న్యాయం నిన్ను పట్టుకున్నాయి.
18ధనంతో ఎవరు నిన్ను మభ్యపెట్టకుండ జాగ్రత్తపడు;
అధిక లంచం నిన్ను దారి తప్పించకుండ చూసుకో.
19మీ సంపదలు మీ శక్తివంతమైన ప్రయత్నాలు
బాధలో ఉండకుండా మిమ్మల్ని తప్పిస్తాయా?
20ప్రజలను వారి ఇళ్ళలో నుండి దూరంగా లాగివేయాలని,
రాత్రి కోసం ఎదురుచూడవద్దు.
21చెడు వైపు తిరుగకుండ జాగ్రత్త వహించండి,
ఎందుకంటే మీరు బాధల్లో పరీక్షించబడతారు.
22“దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు.
ఆయనలాంటి బోధకుడెవరు?
23ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు,
‘నీవు తప్పు చేశావు’ అని ఆయనతో ఎవరు చెప్పారు?
24ప్రజలు పాటలతో కీర్తించిన ఆయన కార్యాలను
ఘనపరచాలని నీవు జ్ఞాపకముంచుకో.
25మనుష్యులందరు వాటిని చూశారు;
మనుష్యులు దూరంగా ఉండి వాటిని చూశారు.
26దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించలేము!
ఆయన సంవత్సరాలను లెక్కించలేనివి.
27“అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు,
అవే ప్రవాహాలకు వర్షంలాగా కురుస్తుంది;
28మేఘాలు వాటి తేమను కురిపిస్తాయి
మనుష్యులపై అవి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి.
29ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో
ఆయన ఆవరణం నుండి ఎలా ఉరుము వస్తుందో ఎవరు గ్రహించగలరు?
30ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో
అవి సముద్ర అడుగుభాగాన్ని ఎలా కప్పివేసారో చూడండి.
31వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు
సమృద్ధిగా ఆహారం ఇస్తారు.
32ఆయన తన చేతులతో మెరుపులను పట్టుకుని
గురికి తగలాలని వాటికి ఆజ్ఞాపిస్తారు.
33ఉరుము రాబోయే తుఫానును ప్రకటిస్తుంది;
పశువులకు కూడ దాని రాకడ తెలుస్తుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 36: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి