యోబు 5
5
1“నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు?
పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు?
2ఆగ్రహం మూర్ఖులను చంపుతుంది.
అసూయ బుద్ధిహీనులను చంపుతుంది.
3మూర్ఖులు వేరుపాదుకోవడం నేను చూశాను,
కాని హఠాత్తుగా వారి ఇల్లు శపించబడింది.
4వారి పిల్లలకు క్షేమం దూరమవుతుంది,
వారి పక్షంగా వాదించేవారు లేక న్యాయస్థానంలో వారు నలిగిపోతారు.
5ఆకలితో ఉన్నవారు వారి పంటను తినివేస్తారు,
ముండ్ల మధ్యలో ఉన్నవాటిని కూడా వారు తీసుకుంటారు,
దాహంతో ఉన్నవారు వారి ఆస్తి కోసం కాచుకుని ఉంటారు.
6కష్టం దుమ్ములో నుండి పుట్టదు.
బాధ భూమిలో నుండి మొలకెత్తదు.
7నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు
నరులు బాధల కోసమే పుడుతున్నారు.
8“ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను;
ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.
9పరిశోధించలేని మహాకార్యాలను
లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.
10ఆయన భూమిపై వాన కురిపిస్తారు;
పొలాలకు నీటిని పంపిస్తారు.
11ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు,
దుఃఖపడేవారిని క్షేమానికి లేవనెత్తుతారు.
12వంచకుల చేతులు విజయం సాధించకుండ,
ఆయన వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తారు.
13జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు,
వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి.
14పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది;
రాత్రిలో తడుముకున్నట్లు వారు మధ్యాహ్న వేళలో తడుముకుంటారు.
15వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు;
బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు.
16కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది,
అన్యాయం తన నోరు మూసుకుంటుంది.
17“దేవుడు సరిదిద్దేవారు ధన్యులు;
కాబట్టి సర్వశక్తిమంతుని#5:17 హెబ్రీలో షద్దాయ్; ఇక్కడ, యోబు అంతట క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు.
18గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే;
ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.
19ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు;
ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.
20కరువు కాలంలో చావు నుండి,
యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.
21కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు,
నాశనం వచ్చినా నీవు భయపడవు.
22కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు,
అడవి మృగాలకు నీవు భయపడే అవసరం లేదు.
23ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు,
అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.
24నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు;
నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు.
25నీకు చాలామంది పిల్లలు ఉంటారని,
నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు.
26పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు
పూర్తి వయస్సు నిండిన తర్వాత నీవు సమాధికి చేరతావు.
27“మేము ఇది పరిశీలించాము, ఇది నిజము.
కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 5: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: