సంఖ్యా 36
36
సెలోఫెహాదు కుమార్తెల వారసత్వం
1యోసేపు వంశం నుండి వచ్చిన మనష్షే కుమారుడు మాకీరు, గిలాదు వంశ పెద్దలు వచ్చి నాయకులు, ఇశ్రాయేలీయుల కుటుంబాల పెద్దలు ఎదుట మోషేతో మాట్లాడారు. 2“చీట్లు వేసి ఇశ్రాయేలీయులకు భూమిని వారసత్వంగా ఇవ్వమని యెహోవా మా ప్రభువుకు ఆజ్ఞాపించినప్పుడు మా సహోదరుడు సెలోఫెహాదు భూ వారసత్వాన్ని అతని కుమార్తెలకు ఇమ్మని ఆజ్ఞాపించారు. 3ఒకవేళ వారు ఇతర ఇశ్రాయేలు గోత్రం వారిని పెళ్ళి చేసుకుంటే, అప్పుడు వారి వారసత్వం పూర్వికుల గోత్రం నుండి మారి వేరే వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది. కాబట్టి వారి వారసత్వం లోని భాగం తీసివేయబడుతుంది. 4ఇశ్రాయేలు యొక్క మహోత్సవ సంవత్సరం#36:4 హె.భా.లో రుణవిమోచన సంవత్సరం వచ్చినప్పుడు, వారి వారసత్వం వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది, మా పూర్వికుల వంశ వారసత్వం నుండి స్వాస్థ్యం పోతుంది” అని అంటూ చెప్పారు.
5అప్పుడు యెహోవా ఆజ్ఞమేరకు మోషే ఇశ్రాయేలీయులను ఆదేశించాడు: “యోసేపు సంతతివారి గోత్రం వారు తెచ్చిన ఫిర్యాదు సరియైనదే. 6సెలోఫెహాదు కుమార్తెల గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: వారు తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చు, కానీ అది వారి తండ్రి గోత్ర వంశం వారై ఉండాలి. 7ఇశ్రాయేలు ప్రజల వారసత్వం ఒక గోత్రం నుండి ఇంకొక గోత్రం లోకి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ తమ పూర్వికుల గోత్ర వారసత్వాన్ని తమ వంశం లోనే ఉంచుకోవాలి. 8ఇశ్రాయేలు ప్రజల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి కుమార్తె తన తండ్రి గోత్రం వారినే పెళ్ళి చేసుకోవాలి. ఈ విధంగా వారి వారి పూర్వికులు వారసత్వం వారి స్వాధీనంలోనే ఉంటుంది. 9వారసత్వం ఒక వంశం నుండి ఇంకొక వంశానికి వెళ్లకూడదు. ప్రతి ఇశ్రాయేలు గోత్రం వారు వారసత్వ భూమిని కాపాడుకోవాలి.”
10కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం సెలోఫెహాదు కుమార్తెలు చేశారు. 11సెలోఫెహాదు కుమార్తెలైన మహ్లా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోవా తమ తండ్రి సహోదరుల కుమారులను పెళ్ళి చేసుకున్నారు. 12వీరు యోసేపు కుమారుడైన మనష్షే సంతతివారిని పెళ్ళి చేసుకున్నారు వారి వారసత్వం వారి తండ్రి గోత్రం లోనే, వంశం లోనే నిలిచింది.
13ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 36: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.