కీర్తనలు 102

102
కీర్తన 102
దుఃఖముచేత ప్రాణము సొమ్మసిల్లినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర.
1యెహోవా, నా ప్రార్థన వినండి;
సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.
2నేను కష్టంలో ఉన్నప్పుడు
మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి.
మీ చెవి నా వైపు త్రిప్పండి;
నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.
3నా దినాలు పొగలా కనుమరుగు అవుతున్నాయి;
నా ఎముకలు నిప్పుకణాల్లా కాలిపోతున్నాయి.
4దెబ్బకు వాడిన గడ్డిలా ఉంది నా హృదయం;
నేను భోజనం చేయడం మరచిపోతున్నాను.
5నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు
నేను అస్థిపంజరంలా ఉన్నాను.
6నేను ఎడారి గుడ్లగూబలా,
శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను.
7నేను మేల్కొని ఉన్నాను;
ఇంటికప్పు మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను.
8రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు;
నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు.
9నేను బూడిదను ఆహారంగా తింటున్నాను
పానీయంలో కన్నీరు కలిపి త్రాగుతున్నాను.
10మీ ఉగ్రతను బట్టి;
మీరు నన్ను ఎత్తి అవతల విసిరివేశారు.
11నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి;
నేను గడ్డిలా వాడిపోతున్నాను.
12కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు;
మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
13మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు,
ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది;
నిర్ణీత సమయం వచ్చింది.
14దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి;
దుమ్ము వారికి దయ కలిగించింది.
15జనులు యెహోవా నామానికి భయపడతారు,
భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు.
16ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి
తన మహిమతో ప్రత్యక్షమవుతారు.
17దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు;
ఆయన వారి మనవులను త్రోసివేయరు.
18ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక,
ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక:
19-20“బందీల మూలుగులు వినడానికి
మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి,
యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు,
పరలోకంలో నుండి భూమిని చూశారు.”
21-22ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు
యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో
అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది
యెరూషలేములో ఆయన స్తుతించబడతారు.
23నా జీవిత గమనంలో#102:23 లేదా తన శక్తిచేత నా బలాన్ని కృంగదీశారు;
ఆయన నా రోజుల్ని తగ్గించారు.
24అందుకు నేనన్నాను:
నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి;
మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి.
25ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు,
ఆకాశాలు మీ చేతి పని.
26అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు;
ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.
మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు
అవి అంతరిస్తాయి.
27కాని మీరు అలాగే ఉంటారు,
మీ సంవత్సరాలకు అంతం ఉండదు.
28మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు;
వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 102: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి