కీర్తనలు 125
125
కీర్తన 125
యాత్రకీర్తన.
1యెహోవాపై నమ్మకము ఉంచేవారు
కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.
2యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు,
ఇప్పుడు ఎల్లప్పుడు
యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.
3నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద
దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు,
లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి
తమ చేతులను ఉపయోగిస్తారు.
4యెహోవా, మంచివారికి
యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.
5అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని
దుష్టులతో పాటు బహిష్కరిస్తారు.
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 125: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.