కీర్తనలు 128
128
కీర్తన 128
యాత్రకీర్తన.
1యెహోవా పట్ల భయం కలిగి,
ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.
2మీరు మీ కష్టార్జితాన్ని తింటారు;
ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
3మీ ఇంట్లో మీ భార్య
ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది;
మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు
ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4యెహోవా పట్ల భయం కలవారు
ఈ విధంగా ఆశీర్వదించబడతారు.
5సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు;
మీ జీవితకాలమంతా
యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.
6మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 128: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.