కీర్తనలు 130

130
కీర్తన 130
యాత్రకీర్తన.
1యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;
2ప్రభువా, నా స్వరం వినండి.
దయ కోసం నేను చేసే మొర
మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.
3యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే,
ప్రభువా, ఎవరు నిలవగలరు?
4కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది,
కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము.
5యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది,
ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.
6కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా
అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా,
నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.
7ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు,
ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది
ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.
8ఆయనే ఇశ్రాయేలీయులను
వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 130: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి