కీర్తనలు 132

132
కీర్తన 132
యాత్రకీర్తన.
1యెహోవా, దావీదును,
అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి.
2అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు,
యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు:
3-5“యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు,
యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు,
నేను నా ఇంట్లోకి ప్రవేశించను,
నా మంచం మీద పడుకోను,
నా కళ్ళకు నిద్ర లేదా
నా కనురెప్పలకు కునుకు రానివ్వను.”
6దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం,
యాయరు పొలాల్లో అది మాకు దొరికింది.#132:6 అలాగే 1 దిన 13:5-6 లో కూడా ఉంది.
7“ఆయన నివాసస్థలానికి వెళ్దాం రండి,
ఆయన పాదపీఠం ఎదుట ఆరాధిద్దాం రండి.
8‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో,
మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.
9మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక;
నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ”
10మీ సేవకుడైన దావీదు నిమిత్తం,
మీ అభిషిక్తుని తిరస్కరించకండి.
11యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు,
అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు:
“మీ సంతానంలో ఒకనిని
మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.
12మీ కుమారులు నా ఒడంబడికను
వారికి బోధించిన చట్టాలను పాటిస్తే,
వారి కుమారులు కూడా
నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు.
13యెహోవా సీయోనును ఏర్పరచుకున్నారు,
దానిని తన నివాస స్థలంగా ఆయన కోరుకున్నారు.
14“ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది;
ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను,
ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.
15ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను;
ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను.
16ఆమె యాజకులకు రక్షణ వస్త్రాలను ధరింపచేస్తాను,
ఆమెలో నమ్మకస్థులైన ప్రజలు నిత్యం సంతోషగానం చేస్తారు.
17“అక్కడ దావీదుకు కొమ్ము మొలిచేలా చేస్తాను
నా అభిషిక్తుని కోసం ఒక దీపం సిద్ధపరుస్తాను.
18అతని శత్రువులకు అవమాన వస్త్రాలను ధరింపచేస్తాను,
కాని అతని తల ప్రకాశవంతమైన కిరీటంతో అలంకరించబడుతుంది.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 132: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి