కీర్తనలు 2

2
కీర్తన 2
1దేశాలు ఎందుకు కుట్ర#2:1 హెబ్రీలో కోపం చేస్తున్నాయి?
ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
2యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా
భూరాజులు లేచి
పాలకులందరు ఒకటిగా చేరి,
3“మనం వారి గొలుసులను తెంపుదాం
వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.
4ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు;
ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.
5ఆయన కోపంతో వారిని గద్దించి
తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,
6“నా పవిత్ర పర్వతమైన సీయోనును#2:6 లేదా యెరూషలేము
నా రాజు ఏలుతున్నారు.”
7నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను:
ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు;
ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.
8నన్ను అడిగితే,
నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా,
భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.
9ఇనుపదండంతో#2:9 లేదా ఇనుపదండంతో వారిని పరిపాలిస్తావు నీవు వారిని నలగ్గొడతావు;
పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”
10కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి;
భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.
11యెహోవాను భయంతో సేవించండి
వణుకుతూ ఆనందించండి.
12ఆయన కుమారున్ని ముద్దాడండి,
లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది.
మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది,
ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది.
ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 2: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి