కీర్తనలు 22
22
కీర్తన 22
సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన
1నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు?
నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు,
వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?
2నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను,
కాని మీరు జవాబివ్వడం లేదు,
రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు.
3మీరు పరిశుద్ధులు;
ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు.
4మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు;
వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు.
5వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు;
మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.
6నేను మనిషిని కాను ఒక పురుగును,
మనుష్యుల చేత తిరస్కరించబడి, ప్రజలచే అవమానించబడ్డాను.
7నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు;
వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు.
8“వాడు యెహోవాను నమ్మాడు,
యెహోవా వాన్ని విడిపించనివ్వండి.
అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి,
ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు.
9నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు;
నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు.
10నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను;
నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.
11శ్రమ నాకు సమీపంగా ఉంది,
నాకు సహాయం చేయడానికి ఒక్కరు లేరు,
నాకు దూరంగా ఉండవద్దు.
12ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి;
బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి.
13గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా
వారు తమ నోరు పెద్దగా తెరిచారు.
14నేను నీటిలా పారబోయబడ్డాను,
నా ఎముకలు కీళ్ళ నుండి తప్పాయి.
నా హృదయం మైనంలా;
నాలో కరిగిపోయింది.
15నా బలం ఎండిన కుండపెంకులా అయింది,
నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది;
మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు.
16కుక్కలు నా చుట్టూ గుమికూడాయి,
దుష్టుల మూక నా చుట్టూ మూగింది;
వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.#22:16 కొ.ప్రా.ప్ర.లలో సింహం చేసినట్టు
17నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి;
ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు.
18నా వస్త్రాలు పంచుకుని
నా అంగీ కోసం చీట్లు వేస్తారు.
19అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి.
మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
20ఖడ్గం నుండి నన్ను విడిపించండి,
కుక్కల బలం నుండి నా విలువైన ప్రాణాన్ని కాపాడండి.
21సింహాల నోటి నుండి నన్ను కాపాడండి;
అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి.
22నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను;
సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను.
23యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి.
యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి!
ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి.
24బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు
వారిని చూసి అసహ్యపడలేదు;
ఆయన ముఖం వారి నుండి దాచలేదు.
ఆయన వారి మొర ఆలకించారు.
25మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను;
మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను.
26దీనులు తృప్తిగా భోజనం చేస్తారు;
యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు,
మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.
27భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని
ఆయన వైపు తిరుగుతారు,
దేశాల్లోని కుటుంబాలన్నీ
ఆయనకు నమస్కారం చేస్తాయి.
28రాజ్యాధికారం యెహోవాదే
ఆయనే దేశాలను పరిపాలిస్తారు.
29లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు;
తమ ప్రాణాలు కాపాడుకోలేక
మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు.
30ఒక తరం వారు ఆయనను సేవిస్తారు;
రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు.
31వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి,
ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి
ఆయన నీతిని తెలియజేస్తారు!
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 22: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: