కీర్తనలు 53
53
కీర్తన 53
సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన.
1“దేవుడు లేడు” అని
బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు.
వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి;
మంచి చేసేవారు ఒక్కరు లేరు.
2అర్థం చేసుకునేవారు,
దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా
అని దేవుడు పరలోకం నుండి
మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు
3ప్రతిఒక్కరు దారి తప్పి చెడిపోయారు;
మంచి చేసేవారు ఎవరూ లేరు
ఒక్కరు కూడా లేరు.
4కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా?
వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు;
వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు.
5అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర,
వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు.
మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు;
దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు.
6సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది!
దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు,
యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 53: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.